Share News

IPL 2025: పేస్ పిచ్చోడు వస్తున్నాడు.. బ్యాటర్లూ బ్యాగులు సర్దుకోండి

ABN , Publish Date - Apr 06 , 2025 | 02:55 PM

Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో పడుతూ, లేస్తూ పోతున్న పాండ్యా సేనను ఆదుకునేందుకు ఓ పేస్ పిచ్చోడు వచ్చేశాడు. అతడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..

IPL 2025: పేస్ పిచ్చోడు వస్తున్నాడు.. బ్యాటర్లూ బ్యాగులు సర్దుకోండి
Mumbai Indians

ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రయాణం సాఫీగా సాగడం లేదు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి స్టార్లతో నిండిన జట్టుకు ఈ సీజన్‌లో సరైన స్టార్ట్ దొరకలేదు. ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచుల్లో కేవలం ఒకే విజయం సాధించింది పాండ్యా సేన. కోల్‌కతా నైట్ రైడర్స్ మీద నెగ్గిన ఎంఐ.. తర్వాతి మ్యాచ్‌లో లక్నో చేతుల్లో ఓడింది. ఆర్సీబీతో మండే ఫైట్‌లో తలపడేందుకు సిద్ధమవుతోంది ముంబై. పడుతూ లేస్తూ పోతున్న ఆ టీమ్‌లో జోష్ నింపేందుకు పేస్ పిచ్చోడు వచ్చేస్తున్నాడు. అతడు గనుక చెలరేగితే బ్యాటర్లు తమ బ్యాగులు సర్దుకోవాల్సిందే. మరి.. ఎవరా స్పీడ్‌స్టర్ అనేది ఇప్పుడు చూద్దాం..


ఆ మ్యాచ్‌తో బరిలోకి..

ముంబై ఇండియన్స్ ఏస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వచ్చేశాడు. ఐపీఎల్-2025లో తొలి మ్యాచ్ ఆడేందుకు పేసుగుర్రం రెడీ అవుతున్నాడు. ఎంఐ ఫ్రాంచైజీ ఓ పోస్ట్ ద్వారా బుమ్రా రాక గురించి తెలిపింది. బ్యాట్లతో తయారు చేసిన కుర్చీపై బుమ్రా కూర్చున్న ఫొటోను పోస్ట్ చేసింది. అతడ్ని రారాజుగా చూపిస్తూ.. గర్జించడానికి సింహం సిద్ధమవుతోందంటూ ఆ పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చింది. కాగా, వెన్ను గాయంతో కొన్నాళ్లుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉంటూ కోలుకున్నాడు బుమ్రా. ఫిట్‌నెస్ టెస్ట్‌ పాస్ అవడంతో తాజాగా ముంబై శిబిరంలో జాయిన్ అయ్యాడతను. ఆర్సీబీతో ఏప్రిల్ 7వ తేదీన జరిగే మ్యాచ్‌లో అతడు ఆడనున్నాడని తెలుస్తోంది. బుమ్రా తుదిజట్టులోకి వస్తే ఎవర్ని బెంచ్ మీద కూర్చోబెడతారో చూడాలి.


ఇవీ చదవండి:

ఆయన ‘టీమిండియా’కు ఫీల్డింగ్‌ నేర్పుతాడు..

1996 వరల్డ్‌కప్‌ విజేతలతో మోదీ

పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 06 , 2025 | 03:35 PM