Share News

SRH vs GT Prediction: ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్ జీటీ.. లెక్కలు తేలుస్తారా.. లొంగిపోతారా..

ABN , Publish Date - Apr 06 , 2025 | 03:32 PM

IPL 2025: పాత లెక్కలు తేల్చాల్సిన సమయం వచ్చేసింది. గుజరాత్ టైటాన్స్ బెండు తీసి కొత్త సీజన్‌లో తిరిగి పట్టాలెక్కాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. ఆ జట్టుపై రికార్డులను కూడా మెరుగుపర్చుకోవాలని చూస్తోంది.

SRH vs GT Prediction: ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్ జీటీ.. లెక్కలు తేలుస్తారా.. లొంగిపోతారా..
SRH vs GT Prediction

ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏమాత్రం అంచనాలను అందుకోవడం లేదు. హ్యాట్రిక్ పరాభవాలతో టీమ్ డీలాపడింది. హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జట్టు.. వరుస ఓటములతో తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవక తప్పని పరిస్థితి. అందుకే నేడు గుజరాత్ టైటాన్స్‌తో జరిగే సమరంలో విజయభేరి మోగించాలని కమిన్స్ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి.. గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..


బలాలు

హైదరాబాద్: ఎస్ఆర్‌హెచ్‌కు బ్యాటింగే ప్రధాన బలం. హెడ్, అభిషేక్, క్లాసెన్, ఇషాన్, నితీష్, అనికేత్ వర్మ లాంటి టాప్ హిట్టర్స్ టీమ్‌లో ఉన్నారు. వీళ్లంతా తమదైన రోజును సింగిల్ హ్యాండ్‌తో గెలిపించగల సమర్థులే. కెప్టెన్ కమిన్స్ పేస్ బౌలింగ్‌లో కీలకం. నయా స్పిన్నర్ జీషన్ అన్సారీ మీద జట్టు గంపెడాశలు పెట్టుకుంది.

గుజరాత్: ఈ జట్టు ప్రధాన బలం బౌలింగ్. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిశోర్‌తో కూడిన బౌలింగ్ యూనిట్ సూపర్ ఫామ్‌లో ఉంది. అటు బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ నిలకడగా పరుగులు చేస్తున్నాడు. బట్లర్ కూడా ఫామ్ అందుకున్నాడు. రూథర్‌ఫోర్ట్ ఎలాగూ దంచడానికి సిద్ధంగా ఉంటాడు.


బలహీనతలు

హైదరాబాద్: ఈ జట్టు మెయిన్ వీక్‌నెస్ బౌలింగ్. ఎన్నో ఆశలు పెట్టుకున్న షమి తరచూ విఫలమవుతున్నాడు. సిమర్జీత్, హర్షల్ ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్నారు. కెప్టెన్ కమిన్స్ కూడా వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతున్నాడు. అటు బ్యాటింగ్‌లో టాప్‌-3లో అభిషేక్, ఇషాన్ టచ్ కోల్పోయారు. నితీష్ రెడ్డి మంచి స్టార్ట్ అందుకున్నా ఔట్ అవుతున్నాడు. బౌలింగ్ లోపాలకు తోడు బ్యాటింగ్ మిస్టేక్స్ టీమ్‌కు కాస్ట్‌లీగా మారుతున్నాయి.

గుజరాత్: బౌలింగ్‌లో రషీద్ ఖాన్ ఔటాఫ్ ఫామ్‌లో ఉన్నాడు. వికెట్లు తీయలేక, రన్స్ ఇచ్చుకొని తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. పర్సనల్ రీజన్స్ వల్ల రబాడ ఇంటికి వెళ్లిపోవడం మరో మైనస్. బ్యాటింగ్‌లో గిల్-సుదర్శన్-బట్లర్ మీద ఓవర్ డిపెండ్ అవుతోంది జీటీ. ఒకవేళ త్రిమూర్తులు ఔట్ అయితే.. ఆ జట్టుకు డేంజర్ తప్పదు.


హెడ్ టు హెడ్

ఎస్‌ఆర్‌హెచ్-జీటీ మధ్య ఇప్పటివరకు 5 మ్యాచులు జరిగాయి. ఇందులో గుజరాత్ 3 మ్యాచుల్లో, హైదరాబాద్ 2 మ్యాచుల్లో విజయం సాధించాయి. చివరగా గత సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో జీటీ 7 వికెట్ల తేడాతో గెలిచింది.

విన్నింగ్ ప్రిడిక్షన్

గుజరాత్ వైపు విన్నింగ్ మూమెంటమ్ ఉంది. గత 2 మ్యాచుల్లో ఆ టీమ్ నెగ్గింది. దానికి తోడు అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. టీమ్ పరంగా సన్‌రైజర్స్‌కు తిరుగులేదు. స్టార్ బ్యాటర్లతో జట్టు పటిష్టంగా ఉంది. కానీ ఎస్‌ఆర్‌హెచ్ హ్యాట్రిక్ ఓటములతో తీవ్రమైన ఒత్తిడి, హోమ్ గ్రౌండ్‌లో గెలిచి తీరాలనే ప్రెజర్, ప్లేయర్ల ఔటాఫ్ ఫామ్‌‌ను దృష్టిలో పెట్టుకొని చూస్తే.. ఇవాళ్టి మ్యాచ్‌లో జీటీ విజయం ఖాయం.


ఇవీ చదవండి:

పేస్ పిచ్చోడు వచ్చేశాడు

ఆయన ‘టీమిండియా’కు ఫీల్డింగ్‌ నేర్పుతాడు..

పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 06 , 2025 | 04:09 PM