Home » Ugadi
నామినేటెడ్ పదవుల భర్తీ కోసం టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నెల 30న ఉగాది పర్వదినాన మూడో విడత జాబితా విడుదల చేయాలని కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈ సారికి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల భర్తీకే పరిమితం కావాలని భావిస్తుండడంతో కీలకమైన కార్పొరేషన్లను ఆశిస్తున్న ఆశావహులకు నిరాశేనని చెప్పవచ్చు.
సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లిలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో తొలుత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే సన్నబియ్యం రవాణా ప్రక్రియను ప్రారంభించారు.
పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతిపాదించిన పీ4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో గురువారం ఉగాది ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. చిన్నటేకూరు గ్రామంలో ఊరేగింపు సమయంలో ప్రభకు విద్యుత్ వైరు తగిలి షార్ట్‌సర్క్యుట్ కావడంతో ప్రభలో కూర్చున్న 13 మంది చిన్నారులు విద్యుత్ షాక్‌కు గురై గాయపడ్డారు. చిన్నటేకూరు గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా మూడు రోజులుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. అయితే కొన్ని చోట్ల ఉగాది ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు ఉగాది ఉత్సవాల్లో అపశృతి తలెత్తింది.
తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి ఇంట్లో ఉగాది వేడుకలు నిర్వహిస్తారు. ఇక రాజకీయ పార్టీలు అయితే పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు నిర్వహించి, పంచాంగ శ్రవణం నిర్వహించడం ఓ అలవాటుగా వస్తోంది. కాని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఉగాది వేడుకల్లో పాల్గొని పంచాంగ శ్రవణం కార్యక్రమానికి దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
సొంత వర్గం నేతల నుంచే కొన్ని వ్యతిరేకతలు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయంలో రాజు జాగ్రత్తగా ఉండాలి’... ఇదీ సరిగ్గా ఏడాది క్రితం బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహించిన శోభకృత్ ఉగాది(Ugadi) వేడుకల సందర్భంగా పంచాగకర్త, వేదపండితుడు సంతోష్ కుమార్ శాస్త్రి అప్పటి సీఎం కేసీఆర్‌ను(KCR) ఉద్దేశిస్తూ చేసిన సూచన ఇది!
Ugadi 2024: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధి నామ ఉగాది(Ugadi 2024).. తెలుగవారందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో(TDP Office) పంచాంగ శ్రవణం కార్యక్రమం..
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన పంచాగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు లోని తన నివాసంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు