Home » Uppal
మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఖాతాలో చేరింది. మేయర్‌గా మేడ్చల్ కాంగ్రెస్ ఇన్చార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్ కుమారుడు తోటకూర అజయ్ యాదవ్ ఎన్నికయ్యారు.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని బోడుప్పల్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతమైంది. బీఆర్‌ఎ్‌సకు చెందిన మేయర్ సాముల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీరవిగౌడ్‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది.
గత కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల పెండింగ్‌లో ఉన్న 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం, తప్పుచేసిన అధికారులపై తెలంగాణ పోలీస్ శాఖ వరుసగా చర్యలు చేపడుతోంది. పోలీస్ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కిందిస్థాయి అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తప్పు చేసిన అధికారులను ఎన్నిసార్లు హెచ్చరించినా ఇష్టారీతిగా వ్యవహరిస్తుండటంతో బదిలీ వేటు వేసి సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నారు.
ఉప్పల్ భగాయత్(Uppal Bhagayat)లో పోకిరీల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. రాత్రివేళ భగాయత్‌కు వచ్చే జంటలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిందుతులను శిక్షించాల్సిన ఎస్సై వారికే మద్దతు తెలపడంతో ఉన్నతాధికారులు అతణ్ని డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
భాగ్యనగరంలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుస దోపిడీలు, దొంగతనాలతో అంతర్రాష్ట్ర ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. వనస్థలిపురంలో దారి దోపిడీ మరవక ముందే మేడ్చల్‌లోని ఓ గోల్డ్ షాప్‌లో రాబరికి యత్నించారు.
ఉప్పల్ నియోజకవర్గం(Uppal Constituency)లో శాసనసభ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. గతేడాది నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని ఆరు నియోజకవర్గాలతో పాటు ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భారీ ఆదిక్యతను ఇచ్చిన నగర ఓటర్లు లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి అదే ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకానగర్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఓ కొడుకు తన కన్నతల్లిని ఇంటి నుంచి బయటకు గెంటివేశాడు. దీంతో ఆ తల్లి ఇంటి ముందు నిరసనకు దిగింది.
హైదరాబాద్ ఉప్పల్‌లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. క్రికెట్ ఆటలో జరిగిన ఓ గొడవ నేపథ్యంలో రాడ్లు, కర్రలతో యువకులపై దాడులకు తెగబడ్డారు. బీఆర్ఎస్ నేతతో సహా ఏడుగురిపై దాడి చేయడంతో వారంతా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
గురువారం జరిగే క్రికెట్ మ్యాచ్‌కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) పరిసర ప్రాంతాలకు 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.