Home » Uttar Pradesh
Nara lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ మహాకుంభమేళాలో పుణ్యస్నానమాచరించారు. సతీమణి బ్రాహ్మిణితో కలిసి లోకేష్ .. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు.
Maha Kumbha Mela 2025 : శనివారం ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో ఉన్నవారిలో 90 శాతం మంది మహాకుంభమేళాకు వెళుతున్నవారే. ఈ ఘటన జరిగి తర్వాత కూడా చాలా మంది ప్రయాణీకులు ప్రయాగ్రాజ్కు వెళ్తున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రైల్వే శాఖ అప్రమత్తమైంది.
గతంలో మహాకుంభ్, కుంభ్మేళాలు 75 రోజుల పాటు నడిచేవని, ఇప్పుడు కుంభ్మేళాకు నిర్దేశించిన రోజులు తక్కువగా ఉన్నాయని అఖిలేష్ యాదవ్ అన్నారు.
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు వెళ్లే ట్రైన్ ప్రయాణికులకు శుభవార్త వచ్చేసింది. పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో ఈరోజు నుంచి కుంభమేళాకు ప్రత్యేక వందే భారత్ టైన్స్ ఉంటాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
శుక్రవారం సాయంత్రానికి కల్లా 50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేయగా, ఈ ఒక్కరోజే 92 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్టు యూపీ సర్కార్ ప్రకటించింది. ఫిబ్రవరి 26 వరకూ కుంభమేళా కొనసాగనుండటంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కళ్యాణ మంటపంలో జరిగిన వివాహ కార్యక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇరు కుటుంబాల తరపు బంధువులతో కళ్యాణ మంటపం సందడి సందడిగా ఉంది. అంతా సంతోషంగా ఉన్న ఆ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ చిరుత పులి కళ్యాణ మంటపంలోకి వచ్చేసింది. చివరకు ఏం జరిగిందో చూడండి..
బంధుమిత్రుల పలకరింపులు, మేళతాళాల మధ్య చిందులతో హడావుడిగా ఉన్న పెళ్లి పందిరిలోకి అనుకోని ఓ అతిథి ప్రవేశించింది. ఆ అనుకోని అతిథి ఎవరో కాదు..
Maha Kumbha Mela 2025 : మహా కుంభమేళాలో ఒక వ్యక్తి ఫోన్ గంటసేపు ఛార్జింగ్ చేసినందుకు ఏకంగా రూ.1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. వినటానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్న ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. త్రివేణి సంగమానికి పుణ్య స్నానాలకు వెళ్లేవారిపై ఇదేం దోపిడీ అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో బుధవారంనాడు బడ్జెట్ సమర్పణ అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు వస్తున్నప్పటికీ సరైన ఏర్పాట్లు చేయలేదని మమతా బెనర్జీ ఆరోపించారు.
Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. భారత్ జోడో యాత్ర సమయంలో సైనికులపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కొత్త కేసు కాంగ్రెస్ అగ్రనేతకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.