Maha Kumbha Mela : మహాకుంభమేళాలో ఫోన్ ఛార్జింగ్ చేస్తే.. గంటకు రూ.1000 వసూలు..!
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:56 PM
Maha Kumbha Mela 2025 : మహా కుంభమేళాలో ఒక వ్యక్తి ఫోన్ గంటసేపు ఛార్జింగ్ చేసినందుకు ఏకంగా రూ.1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. వినటానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్న ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. త్రివేణి సంగమానికి పుణ్య స్నానాలకు వెళ్లేవారిపై ఇదేం దోపిడీ అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Maha Kumbha Mela 2025 : ప్రయాగ్‌రాజ్‌లో కన్నులపండువగా జరుగుతున్న మహాకుంభమేళా దేశవిదేశాల నుంచి భక్తులతో కిక్కిరిసిపోతోంది. నిలబడటానికే జాగా లేనంతగా జనసమూహాలు త్రివేణి సంగమ చుట్టుపట్ల కనబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికీ అవసరమే. ఈ సందర్భంగా చాలా చోట్ల ఫోన్ ఛార్జింగ్ కోసం అనేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అయినప్పటికీ ఓ వ్యక్తి ఇక్కడికి వచ్చిన వారి ఫోన్లు ఛార్జింగ్ చేస్తూ నెలకు రూ.1000లు సంపాదిస్తున్నా అంటూ వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ఇదెలా సాధ్యమని నెటిజన్లు విస్తుపోతున్నారు.
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమానికి చిత్రవిచిత్రమైన ప్రజలు, సాధువులు వస్తున్నారు. అందుకే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మొదలైన రోజు నుంచి ప్రత్యేకంగా కనిపించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు వచ్చిన ప్రతి వారి పంట పండినట్లే అని భావించాలి. భక్తులకు బొట్టు పెట్టడం, ఛార్జింగ్, పూసల దండలు ఇలా వివిధ వ్యాపారాలు చేస్తూ పుష్కలంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఆ సంఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు ఈ మధ్య కాలంలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.
ఫోన్ ఛార్జ్ చేస్తే గంటకు రూ.1000..
ఇటీవల కుంభమేళాకు చెందిన వీడియో ఇంటర్నెట్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇందులో ఒక వ్యక్తి కుంభమేళాలో ఫోన్లు ఛార్జ్ చేయడం ద్వారా గంటకు రూ. 1,000 సంపాదిస్తున్నట్లు చూపించారు. పోస్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే ఈ వీడియోకి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. వీడియో తీస్తున్న వ్యక్తి వారి చూపిస్తూ, 'ఈ అబ్బాయి మహా కుంభ్‌లో గంటకు 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అదీ ఎటువంటి ఖర్చు లేకుండా. అతడు ఇక్కడ గంటకు 20 ఫోన్‌లను ఒకేసారి ఛార్జ్ చేసి వారి నుంచి రూ.50 రూపాయలు వసూలు చేస్తాడు. విద్యుత్ ఖర్చుకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే గంటకు కనీసం రూ.1000 రూపాయలు సంపాదిస్తున్నాడు.' అని చెప్తాడు.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "మహాకుంభమేళాలో ప్రతి 100 మీటర్ల దూరానికి ఉచిత ఛార్జింగ్ ఉంటుంది." "ఇదంతా అబద్ధం", "అంతా ఉచితం. మోసపోకండి" అంటూ రకరకాలుగా విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
New Income Tax Bill: సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
Prathyekam: ఇలాంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మకండి.. వాళ్ళు కీడే కోరుకుంటారు..
RSS New Complex : సేవకుల కొత్త ఇల్లు.. 300 గదుల నిర్మాణానికి ఎన్ని కోట్లో తెలిస్తే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..