Home » Vikarabad
సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండలంలోని ఎక్ మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో అలీకి భూమి, ఫామ్‌హౌస్ ఉంది. అందులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు నోటీసు ఇచ్చారు.
మూసీ నది ప్రక్షాళన హైదరాబాద్ నుంచి కాకుండా ఆ నది జన్మించిన అనంతగిరి కొండల నుంచి ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటన ప్రభుత్వ కుట్రేనని.. కలెక్టర్, అధికారులపై దాడి కాదని, అది ధర్మాగ్రహమేనని, దాన్ని సాకుగా తీసుకుని గ్రామాలను వల్లకాడు చేస్తున్నారని సేవాలాల్‌సేన, పౌరహక్కుల సంఘం, గిరిజన సంఘాలు ఆరోపించాయి.
లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తముందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ రూ.10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే లగచర్లలో అమాయక గిరిజన రైతుల్ని రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ విప్ రాంచంద్రనాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే బాలూ నాయక్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక నియంతలా ప్రవర్తిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు.
తెలంగాణలోని లగచర్లలోనూ మణిపూర్ వంటి పరిస్థితే ఉందని, అక్కడి గిరిజనుల గోడు దేశమంతా వినాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. తెలంగాణలో గిరిజనులకు న్యాయం దక్కడం లేదని, అందుకే వారి సమస్యను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకొచ్చామని అన్నారు.
లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో అరెస్టయిన బాధిత రైతుల కుటుంబాల సభ్యులు తమపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు.
లగచర్లలో రైతులు దాడులు చేశారన్న నెపంతో పోలీసులు అక్కడి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ నేతలు శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
లగచర్ల ఫార్మావిలేజ్ ఘటనలో పోలీసులు శనివారం మరో నలుగురిని అరెస్టు చేశారు. పరిగి ఠాణా నుంచి వారిని తరలించి.. కొడంగల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.