Home » Vizag News
ఆ కుటుంబం విశాఖపట్నం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చింది. నగరంలోని ఓ హోటల్లో బస చేసింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులకు దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి, ఇక్కడి నుంచి ముంబై బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండ్ అయింది.
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈరోజు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో ఫ్లైట్‌కి బాంబు బెదిరింపు కాల్ చేశారు. ఎయిర్ పోర్టు అధికారులు విమానాన్ని పరిశీలించారు
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు (25వ తేదీ వరకు) పలు రైళ్లు రద్దు చేసినట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్(Waltheru Division Senior DCM K. Sandeep) తెలిపారు.
వేల కోట్ల విలువైన దసపల్లా భూముల వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ భూములు నిషేధిత జాబితా 22-ఏ నుంచి తొలగింపు ప్రక్రియ మొదలుకొని అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణానికి జరిగిన ఒప్పందంలో గూడుపురాణిపై నిగ్గుతేల్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.
వైసీపీ ప్రభుత్వంలో విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం జరిగిందని.. రైతుల డబ్బులను దోచుకున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేత, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుటుంబ సభ్యులు విశాఖ డెయిరీని తమ అడ్డాగా చేసుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.
విశాఖపట్నం మీదుగా నడిచే నాల్గో వందే భారత్ రైలు ఇదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని తెలిపారు. విశాఖలో మూడు వందే భరత్ రైళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని కింజరాపు రామ్మోహన్ అన్నారు.
విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం జరిగింది. లిథియం బ్యాటరీ అన్లోడ్ చేస్తున్న సమయంలో కంటైనర్‌లోని ఒక బాక్స్ లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.
సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగారు. సోమవారం నాడు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. ఎక్కడో తేడా కొట్టినట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందనే అనుమానాలు వైసీపీ క్యాడర్లో గట్టిగానే వస్తున్నాయ్. ఇందుకు కారణం..