Home » YS Rajasekhara Reddy
2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం నాడు నేడు. 2019 ఎన్నికల వేళ ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్ జగన్‌కి, 2024 ఎన్నికల వేళ ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్‌కు మధ్య చాలా తేడా ఉందని.. ఈ నేపథ్యంలో నాడు నేడు తరహాలో రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
శవం ఎదురొస్తే.. మంచి శకునమని శకున శాస్త్రం చెబుతుంది. అయితే ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి మాత్రం ‘శవ రాజకీయం’ బాగా కలిసి వస్తుందనే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తన తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం నాటి నుంచి నేటి వరకు వైయస్ జగన్ శవ రాజకీయాన్నే ఆలంబనగా చేసుకొని ముందుకు సాగుతున్నారనే ఓ ప్రచారం సైతం సదరు సర్కిల్‌లో నడుస్తోంది.
నేటి నుంచి బస్సుయాత్ర ద్వారా ఏపీ పీసీసీ ఛీఫ్ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్ధి షర్మిలా రెడ్డి ప్రచారం ప్రారంభించనున్నారు. కడప పార్లమెంటు పరిధిలోఎంపీ అబ్యర్థిగా ప్రచారంలో పాల్గొననున్నారు. మొదటి రోజైన నేడు బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.
ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్ధనల్లో తల్లి వైఎస్ విజయమ్మ...పలువురు ఎంపీలు, ఎమ్మేల్యేలు పాల్గొన్నారు. చాంతాడంత లిస్ట్ చెప్పి.. అవి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి ఫైనల్‌గా నేడు బస్సు యాత్ర పేరిట ఓట్ల వేటకు జగన్ బయలుదేరారు.
ఎల్లుండి 27 న ఇడుపులపాయ నుంచి సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ప్రొద్దుటూరులో జరగబోయే జగన్ బస్సుయాత్ర సిద్దం సభకు భారీగా జనాన్ని తరలించాలని నాయకులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. నాయకుల మధ్య సఖ్యత కుదరక మీరు చెప్పినంత మందిని తరలించలేమని నాయకులు తేల్చి చెప్పినట్లు సమాచారం.
వైఎస్ ఫ్యామిలి ఫైట్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కడప వైసీపీ ఎంపీ అభ్యర్ధి వైఎస్ అవినాశ్ రెడ్డిపై వైఎస్ షర్మిల రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన మేరకు షర్మిల కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్న వైసీపీ అభ్యర్ధుల ఎంపిక చివరి జాబితాను ఇడుపులపాయ నుంచి జగన్ ప్రకటించనున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం... వైసీపీ అభ్యర్ధుల చివరి లిస్ట్‌ను విడుదల చేయనున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కాకుంటే రాజకీయంగా జీరో. రాయలసీమలో మరీనూ. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ధనయజ్ఞం సాగించారా లేక జల యజ్ఞం మొదలు పెట్టారా అన్న వివాదాస్పద అంశాలు పక్కన బెడితే మిగులు జలాలతో ప్రతిపాదించబడి దస్త్రాలకే పరిమితమైన రాయలసీమకు చెందిన పలు సాగునీటి ప్రాజెక్టులను పట్టాలకెక్కించారు..
భాగ్యనగరం హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత ముప్పై ఏళ్లలో హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం మాజీ సీఎం చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డును చంద్రబాబు ప్రతిపాదన చేశారని, దానిని కొనసాగించి చంద్రబాబు పూర్తి చేశారని గుర్తు చేశారు.
తాను తెలంగాణ లో తిరగక పోయినా జనసేన ఉందంటే అది మీ అభిమానమేనని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నేడు కొత్తగూడెం ప్రకాశం గ్రౌండ్స్‌లో బిజేపీ, జనసేన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడుతూ.. ...వైఎస్ రాజశేఖర్ రెడ్డి జల యజ్ఞం దోపిడీ వల్లే తెలంగాణ పోరాటానికి పునాది పడిందని పేర్కొన్నారు. కౌలు రైతులను... రైతులు కాదనడం బాగో లేదన్నారు. ధరణిలో లోపాలున్నాయన్నారు. అభివృద్ధి ఆంధ్రాలో జరగకపోతే తెలంగాణ యువత నష్ట పోతుందన్నారు. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత అని.. పారిపోరు జెండా పట్టుకుని నిలబడతారని పవన్ పేర్కొన్నారు.