Home » YSRCP
తల్లికి వందనం పథకం కింద చదువుతున్న పిల్లలకు ఏడాదికి రూ.15వేలు అందిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైసీపీ తల్లికి వందనం పథకం అమలు చేయడం లేదంటూ ప్రచారం చేస్తూ వస్తోంది. తాజాాగా శాసనసభ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకంపై స్పష్టతనిచ్చారు.
YSRCP leaders protest: విజయవాడలో కలెక్టరేట్ ముట్టడి పేరుతో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఏకంగా పోలీసులకు తోసుకుని మరీ కలెక్టరేట్‌లోకి ప్రవేశించారు వైసీపీ శ్రేణులు.
ఓ చోట వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కానీ అక్కడ మాత్రం దివంగత వైఎస్ఆర్ కు గౌరవం దక్కలేదు. అక్కడికి వచ్చిన కీలక నేతలు ఆయన పట్ల నిర్లక్ష్యం వహించారు. దీనిపై ప్రస్తుతం పలువురు పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Chevireddy Bhaskar Reddy notices: వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు పలు కేసులపై జైలులో ఉండగా.. తాజాగా మరో కీలక నేతకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. కానీ పోసాని విడుదలకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌పై పోసానిని ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. మంగళవారం పోసానికి కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.
Lokesh response YSRCP protests: ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనలపై మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు వాళ్లే పెట్టి తిరిగి వాళ్లే ధర్నాలు చేయడం ఏంటి అంటూ ఫైర్ అయ్యారు.
Borugadda Anil: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే.. చెన్నై నుంచి ఫ్లైట్‌లో రాజమండ్రి వచ్చి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది.మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో..
AP Legislative Council: ఏపీ శాసనసమండలి సమావేశాలు కొద్దిసేపు వాయిదా పడ్డాయి. సభలో వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు సభలో ఆందోళనకు దిగారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నామని, కన్నుమూసి కన్ను తీరిచేలోపు ఏడాది గడిచిందని, మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే వచ్చేది వైసీపీనేనని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత వైసీపీ పాలనలో అన్నీ వర్గాలను అక్కున చేర్చుకున్నామని,వైసీపీ ఏదైనా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకమని ఆయన అన్నారు.
బోరుగడ్డ అనిల్ కోసం గుంటూరు పోలీసులు రాజమండ్రి జైలుకు వెళ్లారు.ఫాస్టర్‌ను బెదిరించిండంతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పీటీ వారెంట్‌పై అనిల్‌ను అదుపులోకి తీసుకోనున్నారు.