Share News

Pharmacist Death: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ కన్నుమూత

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:01 AM

Pharmacist Death: లైగింగ్ వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ నాగాంజలి కథ విషాదంగా ముగిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫార్మాసిస్ట్ కన్నుమూసింది.

Pharmacist Death: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ కన్నుమూత
Pharmacist Death

రాజమండ్రి, ఏప్రిల్ 4: కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో (Kims Bollineni Hospital) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. 12 రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్న ఫార్మాసిస్ట్.. ఈరోజు (శుక్రవారం) ప్రాణాలు విడిచింది. నాగాంజలి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల వల్ల పార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడు దీపక్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ అన్ని రాజకీయ పార్టీల నేతలను బాధితురాలి తల్లిదండ్రులు అనంతలక్ష్మి, దుర్గారావులు మొర్రపెట్టుకున్నారు.


కాగా.. గత నెల 23న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న వికాస్‌ ఫార్మసీ కళాశాల పార్మ్‌ డి ఫైనలియర్‌ విద్యార్థిని నాగాంజలి (23) ఆత్మహత్యాయత్నం తీవ్ర సంచలనం రేపింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మం డలం రౌతుగూడెం గ్రామానికి చెందిన నాగాంజలి రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి వద్ద వికాస్‌ ఫార్మసీ కళాశాలలో ఫార్మ్‌ డి పైనలియర్‌ చదువుతోంది. అయితే గత నెలలో నాగాంజలి ఆస్పత్రిలోనే ఎనస్థీషియా అత్యధిక డోస్‌ ఇంజక్షన్‌ తీసుకుంది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే గమనించిన సహచరులు ఐసీయూలోకి తరలించి చికిత్స అందజేశారు. ఈ క్రమంలో నాగాంజలి డైరీలో రాసుకున్న సూసైడ్ లెటర్ బయటకు రావడంతో తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థినిలు రాజమహేంద్రవరంలో ఆందోళనకు దిగారు.

Railways: ప్లాట్‌ఫామ్ టికెట్ ఎందుకు పెట్టారంటే


ఆసుపత్రిలో మెడికల్‌ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న దీపక్‌ వేధింపుల వల్లే నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు సూసైడ్ నోట్‌లో రాసింది. అంతే కాకుండా సూసైడ్ నోట్‌లో దీపక్‌ వల్ల తాను అనుభవించిన బాధలను వివరించింది. ఓ ఫంక్షన్‌కు రెడ్ శారీ కట్టుకుని వెళ్లడంతో వాడి కళ్లలో పడ్డానని.. తనను మోసం చేశాడని, తనకు మరణం తప్ప వేరే దారి లేదని, తన గురించి బెంగపెట్టుకోవద్దని, తాను మరణించాక అవయవాలు దానం చేయాలి అంటూ ఫార్మాసిస్ట్ సూసైడ్‌ నోట్‌ రాసిమరీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే 12 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నాగాంజలి చివరకు ప్రాణాలను విడిచింది. నాగాంజలి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Tirumala: తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఎలా కొలువయ్యారంటే..

Ancient temples: భారతదేశంలో అతి పురాతనమైన ఐదు ఆలయాల గురించి తెలుసా..


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 11:03 AM