Share News

Rains: అకాల వర్షం.. నగరమంతా చల్లదనం

ABN , Publish Date - Apr 04 , 2025 | 10:46 AM

గత కొద్దిరోజులుగా ఎండవేడిమితో అల్లాడిపోయిన నగర ప్రజలకు అకాల వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం భారీగానే కురిసింది. అయితే.. ఈ వర్షం వేసవి తాపాన్ని కొంత తగ్గించిందని చెప్పవచ్చు.

Rains: అకాల వర్షం.. నగరమంతా చల్లదనం

చెన్నై: గత రెండువారాల్లో ఎండవేడితో అవస్థలు పడుతున్న నగరవాసులకు ఉపశమనం కలిగేలా గురువారం ఉదయం ఓ మోస్తరు వర్షం కురిసింది. కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోనూ పుదుచ్చేరిలోను అక్కడక్కడా వర్షాలు కురిశాయి. నగరంలోఇ తాంబరం, పల్లావరం, గిండి, కోయంబేడు, అన్నానగర్‌, పోరూరు, వానగరం, పెరంబూరు, మాధవరం, అరుంబాక్కం తదితర ప్రాంతాల్లో పావుగంటకు పైగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది.

ఈ వార్తను కూడా చదవండి: Breaking News: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన


nani1.2.jpg

ఇదే విధంగా నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూరు, ఈరోడ్‌, తేని, దిండుగల్‌, మదురై(Erode, Theni, Dindigul, Madurai), విరుదునగర్‌, తిరునల్వేలి, తూత్తుకుడి, కన్నియాకుమారి జిల్లాల్లోనూ చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. చెంగల్పట్టు జిల్లాలో గురువారం వేకువజాము 3 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా భారీగా వర్షాలు కురిశాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోనూ, నగర శివారు ప్రాంతాల్లోనూ ఉదయం 11 గంటల దాకా చల్లటివాతవారణమే నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి:

2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్‌!

మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్‌ జైలుకే!

అకాల వర్షంతో అతలాకుతలం

రెయిన్ అలర్ట్.. మరో రెండు గంటలపాటు..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 04 , 2025 | 10:46 AM