చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ‘జియో బిజినెస్‌’తో బంపర్ ఆఫర్

ABN , First Publish Date - 2021-03-10T03:14:06+05:30 IST

చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం జియో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. జియో బిజినెస్ పేరుతో సరికొత్త సేవలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఆయా పరిశ్రమలకు అతి తక్కువ ఖర్చకే ఫైబర్ సేవలను..

చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ‘జియో బిజినెస్‌’తో బంపర్ ఆఫర్

ఇంటర్నెట్ డెస్క్: చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం జియో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. జియో బిజినెస్ పేరుతో సరికొత్త సేవలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఆయా పరిశ్రమలకు అతి తక్కువ ఖర్చకే ఫైబర్ సేవలను, డిజిటల్ కనెక్టివిటీ సేవలను అందించనుంది. ఈ మేరకు జియో మంగళవారం ప్రకటించింది. దీనికోసం మరికొన్న సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకుని సులభంగా వినియోగించేలా, వ్యాపార సామర్థ్యం, తక్కువ ఖర్చుకు డిజిటల్ సేవలు వంటి మూడు ప్రధాని విధానాలతో ఈ సేవలను జియో తీసుకురానుంది. ఈ క్రమంలోనే జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్థంభాలని, ప్రస్తుతం వారికి డిజిటల్ సేవలు అందుబాటులో లేవని, వాటిని వినియోగించుకోవడం గురించి కూడా ఆయా పరిశ్రమల యాజమాన్యాలకు అంతగా అవగాహన లేదని, దానివల్ల వారికి తమ పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవడం కష్టమవుతోందని అన్నారు. అలాంటి వారికి డిజిటల్ సేవలను అత్యంత చవుకగా అందించి, డిజిటల్ వేదికలకు కూడా వారి వ్యాపారాలు విస్తరించేందుకు సహకరించనున్నట్లు తెలిపారు.


‘ప్రస్తుతం చిన్నతరహా పరిశ్రమలు ఉత్పత్తి, వాటికి కావలసిన యంత్రాలు, మార్కెటింగ్ వంటి వాటి కోసం రూ.15,000 నుంచి 20,000 వరకు నెలకు ఖర్చు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జియో తొలి అడుగుగా.. చిన్నతరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ప్రస్తుత మార్కెట్ విలువలో కేవలం 10శాతం ఖర్చుతో డిజిటల్ సేవలను అందించనున్నాం. దీనివల్ల వారికి నెలకు రూ.1000 కంటే తక్కువ ఖర్చవుతుంద’ని ఆకాశ్ అంబానీ తెలిపారు.

Updated Date - 2021-03-10T03:14:06+05:30 IST

News Hub