ధోనీ ‘సన్యాసి’ లుక్ వెనుక ఉన్న కథ ఇదే..!
ABN , First Publish Date - 2021-03-15T09:44:18+05:30 IST
మిలమిల మెరుస్తున్న గుండుతో, నిండుగా ధరించిన లేత నీలిరంగు వస్త్రంతో.. ఓ బౌద్ధ సన్యాసిలా కనిపిస్తున్న భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చిత్రమొకటి సామాజిక మాధ్యమాల్లో...

చెన్నై: మిలమిల మెరుస్తున్న గుండుతో, నిండుగా ధరించిన లేత నీలిరంగు వస్త్రంతో.. ఓ బౌద్ధ సన్యాసిలా కనిపిస్తున్న భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చిత్రమొకటి సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. వచ్చేనెల తొమ్మిదిన ప్రారంభమయ్యే 14వ సీజన్ ఐపీఎల్‌కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఇప్పటికే హోం గ్రౌండ్‌లో ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇంతలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన మహీ ఫొటోతో అతడి ఫ్యాన్స్ ఆశ్చర్యచకితులయ్యారు. ‘మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ క్యాంప్‌లో దృశ్యం’ అంటూ ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ ఈ చిత్రాన్ని పోస్ట్ చేసింది. దాంతో ఈ ఫొటోపై నెటిజన్లు ఎవరి స్టయిల్లో వారు వ్యాఖ్యానాలు చేసినా.. ఆ దృశ్యం రాబోయే ఐపీఎల్ ప్రమోషన్‌కు సంబంధించి రూపొందించిన యాడ్‌లో భాగం. అందులో మహీ.. ఐపీఎల్‌లో ఐదు టైటిళ్లు కొట్టిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, ఒక్కసారీ విజేత కాలేకపోయిన బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ గురించి చిన్నారులకు వివరిస్తాడు.