Share News

Rohit-Kohli: దుబాయ్ ఎరుపెక్కాల.. కోహ్లీ ఫోర్లతోనైనా.. రోహిత్ సిక్సులతోనైనా..

ABN , Publish Date - Mar 08 , 2025 | 12:14 PM

ICC Champions Trophy 2025 Final: 12 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు భారత్ ముందు సువర్ణావకాశం. రేపు కివీస్‌తో జరిగే ఆఖరి పోరులో గెలిస్తే కప్పుతో స్వదేశానికి చేరుకోవచ్చు.

Rohit-Kohli: దుబాయ్ ఎరుపెక్కాల.. కోహ్లీ ఫోర్లతోనైనా.. రోహిత్ సిక్సులతోనైనా..
IND vs NZ

15 ఏళ్లకు పైగా సుదీర్ఘ కెరీర్.. ఎన్నో వందల మ్యాచుల్లో ప్రాతినిధ్యం.. వేలాది పరుగుల ప్రవాహం.. లెక్కకు మిక్కిలి రికార్డులు.. వరల్డ్ కప్ సహా చాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ ‌టీమ్‌లో భాగస్వామ్యం.. ఇదీ రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ ఘనత. వాళ్ల కెరీర్‌ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా సరిపోవు. దశాబ్దంన్నరకు పైగా కెరీర్‌లో వాళ్లు చూడని విజయం లేదు.. అందుకోని కప్పూ లేదు. అయితే కెరీర్ చరమాంకంలో ఉండటంతో మళ్లీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం కనిపించడం లేదు. అందుకే ఈసారి ట్రోఫీని పోనిచ్చే ప్రసక్తే లేదన్నట్లుగా ఆడుతున్నారు.


కప్పుతోనే ఇంటికి..

చాంపియన్స్ ట్రోఫీ-2025లో రోహిత్-కోహ్లీ దుమ్మురేపుతున్నారు. హిట్‌మ్యాన్ బ్యాట్ నుంచి బిగ్ నాక్ రాకపోయినా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో మెరుపు ఆరంభాలు అందిస్తున్నాడు. అటు కోహ్లీ భారీ స్కోర్లతో రిజల్ట్‌ను శాసిస్తున్నాడు. ఇద్దరూ ఇంకొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడినా తిరిగి ఈ టోర్నమెంట్‌లో కనిపించే అవకాశం లేకపోవడంతో చెలరేగి ఆడుతున్నారు. మరోసారి కప్పును ముద్దాడాలని చూస్తున్నారు. అనుకున్నట్లే ఫైనల్‌కు చేరుకుంది టీమిండియా. కాబట్టి రేపు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి వీరికి ట్రోఫీని అంకితం ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.


కాలర్ ఎగరేయాలి

ఫైనల్ మ్యాచ్‌లో దుబాయ్ ఎరుపెక్కాలని ఫ్యాన్స్ అంటున్నారు. కోహ్లీ ఫోర్లతోనైనా.. రోహిత్ సిక్సులతోనైనా.. స్టేడియం ఎరుపెక్కాల్సిందేని కామెంట్స్ చేస్తున్నారు. కివీస్ బౌలర్లకు పోయించాలని.. అందులో రోకో జోడీ భాగస్వామ్యం భారీగా ఉండాలని చెబుతున్నారు. కుదిరితే ఇద్దరూ సెంచరీలు కొట్టి మ్యాచ్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తే దాన్ని మించిన సంతోషం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. కప్పుతో రోకో జోడీ కాలర్ ఎగరేసే సీన్ కోసం అంతా వెయిట్ చేస్తున్నామని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. మరి.. అభిమానుల ఆశల్ని రోకో ద్వయం నెరవేర్చుతుందో లేదో చూడాలి.


ఇవీ చదవండి:

ఫైనల్ మ్యాచ్ టై అయితే.. ఏం చేస్తారు..

కివీస్ కోసం త్రిశూల వ్యూహం

ఫైనల్స్‌లో వర్షం పడితే విన్నర్ ఎవరు..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 08 , 2025 | 12:16 PM