Share News

Chandrababu International Womens Day: మీ గౌరవాన్ని మరింత పెంచుతా.. మహిళా దినోత్సవంలో సీఎం

ABN , Publish Date - Mar 08 , 2025 | 03:06 PM

CM Chandrababu: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మర్కాపురంలో స్వయం సంఘాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణాలను పంపిణీ చేశారు. మహిళల కోసం పోలీస్ శాఖ రూపొందించిన శక్తి యాప్‌‌ను ప్రారంభించారు.

 Chandrababu International Womens Day: మీ గౌరవాన్ని మరింత పెంచుతా.. మహిళా దినోత్సవంలో సీఎం
CM Chandrababu naidu

ప్రకాశం, మార్చి 8: ఆడబిడ్డలు అభివృద్ధిలో భాగస్వామ్యం కాకపోతే చులకనగా చూసే అవకాశం ఉంటుందని.. ఆర్థికంగా సమాజంలో పైకి వచ్చేందుకు, ఆడబిడ్డల గౌరవం పెంచేందుకు డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో సీఎం మాట్లాడుతూ.. పొదుపు ఉద్యమంతో ప్రారంభించానన్నారు. గతంలో ఎన్నో మీటింగ్ పెట్టి మహిళలతో మాట్లాడేవాడినని చెప్పారు. పొదుపు వల్ల మహిళలు.. తమ పిల్లలను చదివించుకుంటున్నారని, చిన్న వ్యాపారాలు పెట్టుకుంటున్నారన్నారు. మహిళల గౌరవం పెరిగిందన్నారు. ఇంట్లో వారు మహిళలను గౌరవిస్తున్నారంటే ఆనాడు తాను ఆలోచించిన విధానమే కారణమన్నారు. మహిళలను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్తానన్నారు. మహిళలు తమ ఊర్లోనే కూర్చుని డబ్బులు సంపాదించే విధానానికి శ్రీకారం చుడతానన్నారు.


డ్వాక్రా సంఘాలు, మెప్మా సంఘాల వారికి మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. అందుకు మహిళలు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఆడబిడ్డల కష్టం తీర్చేందుకు దీపం పథకం తీసుకొచ్చామన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తులుగా తయారు చేస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తమదన్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్

‘నా కుటుంబంతో పాటు వ్యాపారంలో భువనేశ్వరి పాత్ర కీలకం. హెరిటేజ్ సంస్థ ని భువనేశ్వరి డెవలప్ చేశారు. నా తల్లి పడిన ఇబ్బందులు మహిళలు పడకూడదనే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశా. ఆడబిడ్డల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చాం. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్. అదే మీకు చివరి రోజు అవుతుంది. గంజాయి, డ్రగ్స్ తాగి ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టం. గత ఐదేళ్లు మహిళలు స్వేచ్ఛగా మాట్లాడిన పరిస్థితి లేదు. మహిళలను బలవంతంగా మీటింగ్‌కు తీసుకువచ్చి బయటకు వెళ్ళకుండా చుట్టూ గుంటలు తీసేవాళ్ళు. మహిళలు ఇంటి నుంచి పని చేసేందుకు గ్రామాల్లో వర్క్ స్టేషన్లు పెడతాం. కంపెనీలు తీసుకువచ్చే బాధ్యత నాది... పని చేసే విధానం మీది’ అని చెప్పుకొచ్చారు.


అప్పుడు వద్దన్నాను.. ఇప్పుడు కనండి..

చైనా, జపాన్‌లో జనం సంఖ్య తగ్గిపోతోందని.. సంపాదించింది అనుభవించడానికి కూడా వారసులు లేకుండా పోతున్నారన్నారు. గతంలో ఒక్కరినే కనమని చెప్పానని.. ఇప్పుడు వీలైనంత ఎక్కువ మందిని కనమని చెబుతున్నానని తెలిపారు. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అవకాశం లేకుండా చట్టం చేశామని.. ఇప్పుడు ఇద్దరి కంటే తక్కువ ఉంటే పోటీ చేసే అవకాశం లేకుండా చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తల్లికి వందననం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 ఇస్తామన్నారు. ఐదు మంది పిల్లలు ఉన్నా.. 60వేలు ఇస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎన్ని సార్లు అయినా మెటర్నిటీ సెలవులు ఇస్తానన్నారు. విజన్ 20-20 ఇచ్చి హైదరాబాద్ డెవలప్ చేశామని తెలిపారు. 2047కు ప్రపంచంలో అగ్ర దేశంగా భారత దేశం ఉంటుందని తెలిపారు. రతన్ టాటా ఛైర్మన్ అయిన తరువాత టాటా కంపెనీని ఆకాశానికి తీసుకెళ్లారన్నారు. రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నామని చెప్పారు. ప్రతి ఇంట్లో ఒక అంట్రప్రీమియర్ ఉండాలన్నారు. మహిళల కోసం 45 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తున్నామని చెప్పారు. అబ్దుల్ కలాం కష్టపడి చదువుకుని దేశానికి రాష్ట్రపతి అయ్యారన్నారు. ప్రజల కోసం వాట్సాప్ గవర్నర్ తీసుకువచ్చామని తెలిపారు. ఏ పని కావాలన్నా వాట్సప్ గవర్నర్‌లో అయిపోయిందని అన్నారు. వాట్సాప్ ద్వారా 200 సర్వీసులు ఆన్‌లైన్‌లో పెట్టామని... రాబోయే రోజుల్లో వెయ్యి సర్వీసులు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.


అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా మార్కాపురంలో. 14,705 స్వయం సహాయక సంఘాలకు రూ.1,826.43 కోట్లు రుణాలను సీఎం పంపిణీ చేశారు. స్త్రీ నిధి రుణాలు పంపిణీ కోసం వెయ్యి కోట్లు చెక్ అందజేశారు. ఆపై 100 మంది మహిళల విజయ గాధ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మహిళలకు ఎలక్ట్రిక్‌ ఆటోలు పంపిణీ చేశారు. మహిళల కోసం పోలీస్ శాఖ రూపొందించిన శక్తి యాప్‌ను ప్రారంభించారు. చేనేత రథం, ఈ-వ్యాపారి పోర్టల్‌ డెలివరీని మొదలుపెట్టారు. మార్కాపురంలో మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు.


ఇవి కూడా చదవండి...

seethakka International Womens Day: మహిళలను ఎదగనిద్దాం... మహిళలను గౌరవిద్దాం.

Insect in biryani: వామ్మో.. అసలు బిర్యానీ తినగలమా

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 08 , 2025 | 04:08 PM