Mumbai Indians: ఐపీఎల్‌కు ముందు ముంబైకి షాక్.. 18 కోట్ల ప్లేయర్ దూరం
ABN , Publish Date - Mar 08 , 2025 | 01:28 PM
IPL 2025: ఐపీఎల్ హాట్ ఫేవరెట్స్‌లో ఒకటైన ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్ తగిలింది. గత సీజన్ మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి.. ఈసారి దుమ్మురేపాలని భావిస్తున్న హార్దిక్ సేనకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

ఐపీఎల్-2025 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి. డొమెస్టిక్ ప్లేయర్లతో పాటు ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా ప్రిపరేషన్స్‌లో పాల్గొంటున్నారు. టోర్నీకి అట్టే సమయం లేకపోవడంతో ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవడం, ఫామ్‌ను అందుకోవడంలో బిజీ అయిపోతున్నారు. టాప్ ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ కూడా సన్నాహాలు షురూ చేసింది. అయితే సరిగ్గా సీజన్ ఆరంభానికి ముందు ఆ టీమ్‌కు గట్టి షాక్ తగిలింది. 18 కోట్ల విలువైన ఓ ఆటగాడు ఎంఐకి దూరమయ్యాడు. మరి.. ఎవరా స్టార్.. ఎందుకిలా జరిగింది.. అనేది ఇప్పుడు చూద్దాం..
ఫస్ట్ వీక్ ఆడనట్లే..
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈసారి పూర్తి ఐపీఎల్ ఆడటం కష్టమేనని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ పేస్ అటాక్‌ను లీడ్ చేసే బుమ్రా.. ఐపీఎల్ కొత్త సీజన్‌లో కనీసం 3 మ్యాచులు మిస్ అయ్యే ప్రమాదం ఉందని సమాచారం. క్యాష్ రిచ్ లీగ్ తొలి వారం అతడు అందుబాటులో ఉండటం లేదని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా.. గాయం నుంచి కోలుకోకపోవడంతో చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడటం లేదు. ఇంకా ఫుల్‌గా రికవర్ కాకపోవడంతో ఐపీఎల్ తొలి వారం అతడు అందుబాటులో ఉండే చాన్స్ లేదని సమాచారం.
మెడికల్ రిపోర్టులు ఓకే
బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. బుమ్రా మెడికల్ రిపోర్టులు బాగున్నాయట. అతడు వేగంగా కోలుకుంటున్నాడట. బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడట. అయితే కంప్లీట్ రికవరీ కానందున ఐపీఎల్ తొలి మూడ్నాలుగు మ్యాచుల్లో ఆడే చాన్స్ లేదట. ఏప్రిల్ మొదటి వారంలో అతడు క్యాష్ రిచ్ లీగ్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని బోర్డు వర్గాల నుంచి ఉప్పందుతోంది. బుమ్రా ఇంకా ఫుల్ ఇంటెన్సిటీ, పేస్‌తో బౌలింగ్ చేయాల్సి ఉందని.. మెడికల్ టీమ్ సూచనల ప్రకారం అతడి ప్రాక్టీస్ క్రమంగా పెరుగుతూ పోతుందని సమాచారం. అతడ్ని బీసీసీఐ మెడికల్ టీమ్ దగ్గరుండి పర్యవేక్షిస్తోందని.. బుమ్రా విషయంలో తొందరపాటుకు చాన్స్ ఇవ్వొద్దనేది బోర్డు పెద్దల నిర్ణయమని వినిపిస్తోంది.
ఇవీ చదవండి:
దుబాయ్ ఎరుపెక్కాల.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల
ఫైనల్ మ్యాచ్ టై అయితే.. ఏం చేస్తారు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి