అమరావతిపై మాట్లాడటం సరికాదు: తలసాని
ABN , First Publish Date - 2020-12-20T01:48:46+05:30 IST
కోర్టు పరిధిలో ఉన్న అమరావతిపై మాట్లాడటం సరికాదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ తోచిపుచ్చారు. విజయ డెయిరీని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ప్రకటించారు.

విజయవాడ: కోర్టు పరిధిలో ఉన్న అమరావతిపై మాట్లాడటం సరికాదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ తోచిపుచ్చారు. విజయ డెయిరీని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ప్రకటించారు. నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ లాభాల బాట పట్టిందని తెలిపారు. శంషాబాద్లో 40 ఎకరాలలో 250 కోట్లతో మెగా డెయిరీ ఏర్పాటు చేస్తామని తలసాని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు ఒక్క ఎలక్షన్ గెలవగానే విర్రవీగుతున్నాయని, మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో బీజేపీ నీటి బుడగ లాంటిదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్పై టీడీపీ విమర్శలు కొత్తవి కాదన్నారు. గతంలో పార్లమెంట్ ముందు చంద్రబాబు పొర్లు దండాలు పెట్టారని ఎద్దేవాచేశారు. ఇపుడు అమరావతిలో చంద్రబాబు పొర్లు దండాలు పెడుతున్నారని తలసాని శ్రీనివాస్ తప్పుబట్టారు.