కొవిడ్-19కు అందుబాటులో ఉన్న పాలసీలు!

ABN , First Publish Date - 2020-09-23T02:22:36+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మనదేశంలోనూ అదే పరిస్థితి. ప్రస్తుతం దేశంలో 51,18,253 నమోదు కాగా, 83,198 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 లక్షలకు పైగా చికిత్స పొందుతున్నారు. కేవలం మన దేశంలో...

కొవిడ్-19కు అందుబాటులో ఉన్న పాలసీలు!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మనదేశంలోనూ అదే పరిస్థితి. ప్రస్తుతం దేశంలో 51,18,253 నమోదు కాగా,  83,198 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 లక్షలకు పైగా చికిత్స పొందుతున్నారు. కేవలం మన దేశంలో మాత్రమే కాదు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలో, ఇటలీలోనూ కరోనా వైరస్ ప్రభావాన్ని విపరీతంగా ఉంది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ చికిత్సకు ఉపయోగపడే ఆరోగ్య బీమాను కలిగి ఉండటం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం.


కరోనా వైరస్ చికిత్సకు కవరేజీ అందించేందుకు బీమా సంస్థలు పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇతర ఆరోగ్య బీమా పథకాల మాదిరిగానే ఈ పాలసీలు కూడా హాస్పిటలైజేషన్ ఖర్చులకు కవరేజీ అందిస్తాయి. అలాగే ప్రీ అండ్‌ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, అవుట్ పేషెంట్ ఖర్చులు, మందుల ఖర్చులు వంటి సమగ్ర కవరేజీని ఈ కరోనా వైరస్ ఆరోగ్య బీమా పాలసీలు అందిస్తాయి. ఇక్కడ గమనించాల్సి మరొక విషయం ఏమిటంటే కొవిడ్-19 ఆరోగ్య బీమా పథకాలు పీపీఈ కిట్ల ఖర్చుకు కూడా కవరేజీ అందిస్తాయి. ఐఆర్డీఏఐ మార్గనిర్దేశకాల మేరకు ప్రత్యేకంగా కొవిడ్-19 కోసం బీమా సంస్థలు కరోనా కవచ్, కరోనా రక్షక్ అనే రెండు రకాల పాలసీలను అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు పాలసీలు ప్రత్యేకంగా కొవిడ్-19 కోసం రూపొందించబడ్డాయి. ఇవి పీపీఈ కిట్స్, మాస్కులు, గ్లౌజుల ఖర్చుతో పాటు, హోం ఐసోలేషన్, డయోగ్నొస్టిక్ ఖర్చులకు కూడా కవరేజీ అందిస్తాయని పాలసీ ఎక్స్‌ డాట్‌కామ్‌ సీఈవో నవల్ గోయల్ తెలిపారు. 


కరోనా కవచ్ బీమా ప్రకారం.. బీమా మొత్తం రూ. 50,000 నుంచి ప్రారంభమై.. గరిష్టంగా రూ. 5 లక్షల వరకు కవరేజీ పొందవచ్చు. ఈ పథకం కుటుంబ సభ్యులకు కూడా రక్షణ కల్పించవచ్చు. అలాగే ఆయుష్ చికిత్సా విధానాలకు కూడా ఈ పథకం కవరేజీ అందిస్తుంది. ఈ పాలసీ కింద ఆప్షనల్ కవర్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది. కొవిడ్-19 చికిత్స కోసం పాలసీదారుడు 24 గంటల కంటే ఎక్కువ సేపు ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రి నగదు ప్రయోజనం కింద బీమా మొత్తంలో 0.5 శాతం రోజువారీ నగదు కింద అందించడం జరుగుతుంది. ఇది గరిష్టంగా 15 రోజుల వరకు చెల్లింపు జరుగుతుంది.


కరోనా రక్షక్ పాలసీ, పాలసీదారుడు కొవిడ్-19 చికిత్స కోసం 72 గంటల కన్నా ఎక్కువ సేపు ఆసుపత్రిలో ఉన్నట్లయితే, బీమా మొత్తం ఒకేసారి అందించడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. అలాగే బీమా మొత్తం కనిష్టంగా రూ.50 వేల నుంచి, గరిష్టంగా 2.5 లక్షలు వరకు ఎంచుకోవచ్చు.

Updated Date - 2020-09-23T02:22:36+05:30 IST