ప్రపంచ క్విజ్జింగ్‌ చాంపియన్‌గా రవికాంత్‌

ABN , First Publish Date - 2020-12-11T09:18:02+05:30 IST

ప్రపంచ క్విజ్జింగ్‌ చాంపియన్‌షి్‌ప పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన రవికాంత్‌ అవ్వ ప్రపంచ విజేతగా నిలిచారు. 2020

ప్రపంచ క్విజ్జింగ్‌ చాంపియన్‌గా రవికాంత్‌

హైదరాబాద్‌, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రపంచ క్విజ్జింగ్‌ చాంపియన్‌షి్‌ప పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన రవికాంత్‌ అవ్వ ప్రపంచ విజేతగా నిలిచారు. 2020 ఏడాదికి నిర్వహించిన పోటీలో ఈ విజయం సాధించారు. గవర్నర్‌ సలహాదారుడు ఏపీవీఎన్‌ శర్మ తనయుడైన రవి కాంత్‌ అవ్వ.. 2018, 2019 సంవత్సరాల్లో జరిగిన ఆసియా-పసిఫిక్‌ పోటీల్లోనూ ప్రతిభ కనబర్చారు.


గత 25 ఏళ్లుగా క్విజ్జింగ్‌లో చురుగ్గా   పాల్గొంటున్నారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూలులో ప్లస్‌టూ చదివారు. ఐఐటీ మద్రాసు,  అహ్మదాబాద్‌ ఐఐఎం, కొలంబియా వర్సిటీలో విద్యను అభ్యసించారు. మెకన్సీ, సిమెన్స్‌, బోస్టన్‌ సైంటిఫిక్‌లో పని చేశారు. ప్రస్తుతం సింగపూర్‌లో రవికాంత్‌ స్ట్రైకర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఈ పోటీల్లో ఇప్పటిదాకా ఇద్దరే భారతీయులు విజేతలుగా నిలిచారు. 2014లో విక్రమ్‌ జోషి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.


Updated Date - 2020-12-11T09:18:02+05:30 IST