ఎస్సీ హాస్టల్‌లో సూర్యమండలం ఏర్పాటు

ABN , First Publish Date - 2021-03-29T05:04:57+05:30 IST

స్థానిక ప్రభుత్వ బాలుర ఎస్సీ వసతిగహం విద్యా ర్థులు సూర్యమండలం మోడల్‌ను రూపొందించారు.

ఎస్సీ హాస్టల్‌లో సూర్యమండలం ఏర్పాటు
హాస్టల్‌లో ప్రకృతి వ్యవసాయంలో ఏర్పాటుచేసిన సూర్యమండలం

వేముల, మార్చి 28: స్థానిక ప్రభుత్వ బాలుర ఎస్సీ వసతిగహం విద్యా ర్థులు సూర్యమండలం మోడల్‌ను రూపొందించారు. కేఎఫ్‌డబ్ల్యూ ఆర్‌పీ బాబు మాట్లాడుతూ హాస్టల్‌లో నాలుగు సెంట్ల స్థలంలో ఏర్పా టు చేసిన ఈ మోడల్‌లో 18 రకాల ఆకుకూరలు, కూరగాయలు, గడ్డ జాతి, తీగజాతి, పండ్ల మొక్కలు వేయించామన్నారు.

ఇందులో 365 రోజులు కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే విధంగా వేశామ న్నారు. ఒకసారి వేసిన ఈ మోడల్లో భూమిని దున్నకూడదన్నారు. మ ల్చింగ్‌ వలన భూమిలో తేమశాతం పెరుగుతుందన్నారు. నీరు ఆదా అవడం, సూక్ష్మజీవులు వృద్దిచెందుతాయన్నారు. కార్యక్రమంలో ఎంఏ రామాంజనేయులు, సీఎస్‌ఏ ఎన్జీఓ రామ్మోహన, ఐసీఆర్‌పీ నాగేంద్ర, హాస్టల్‌ సిబ్బంది బాబు, రామాంజనేయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-29T05:04:57+05:30 IST