ఎస్పీగా మల్లిక గార్గ్‌

ABN , First Publish Date - 2021-07-15T06:43:02+05:30 IST

జిల్లా ఎస్పీగా మల్లిక గార్గ్‌ నియమితులయ్యారు. ఆమేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్పీగా మల్లిక గార్గ్‌

నేడు బాధ్యతలు చేపట్టనున్న రెండో మహిళా ఎస్పీ 

ఒంగోలు (క్రైం), జూలై 14 : జిల్లా ఎస్పీగా మల్లిక గార్గ్‌ నియమితులయ్యారు. ఆమేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2015బ్యాచ్‌కు చెందిన మల్లిక గార్గ్‌కు ఎస్పీగా ఇదే తొలి పోస్టింగ్‌. ఆమె పశ్చిమబెంగాల్‌ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆమె భర్త ముకుల్‌జిందాల్‌ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ కావడంతో మల్లిక గార్గ్‌ను కూడా రాష్ట్రానికి కేటాయించారు. ప్రస్తుతం ఆమె కృష్ణా జిల్లా ఏఎస్పీగా పనిచేస్తుండగా   ఉద్యోగోన్నతి కల్పించి జిల్లాకు ఎస్పీగా నియమించారు. మల్లిక గార్గ్‌ బీటెక్‌ (కంప్యూటర్స్‌) పూర్తిచేసిన వెంటనే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. విద్యాభ్యాసం మొత్తం దేశ రాజధాని ఢిల్లీలో పూర్తిచేశారు. జిల్లాకు 38వ ఎస్పీగా గురువారం బాధ్యతలు తీసుకోనున్నారు. అంతేకాదు జిల్లాలో ఇప్పటివరకు పనిచేసిన ఎస్పీలలో రెండో మహిళా అధికారి. 2003-04లో చారుసిన్హా ఎస్పీగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. తాజాగా నియమితులైన మల్లిక గార్గ్‌ గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. అందుకోసం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ చాంబర్‌ను సిబ్బంది సిద్ధం చేశారు. 





Updated Date - 2021-07-15T06:43:02+05:30 IST