క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో హెచ్‌సీయూ స్థానం పదిలం

ABN , First Publish Date - 2021-06-09T17:46:29+05:30 IST

క్యూఎస్‌ (క్వాకరెల్లీ సై మండ్స్‌) వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ - 2022లో హైదరాబాద్‌ సెం ట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) తనస్థానాన్ని నిలబెట్టుకొంది. మం =గళవారం ప్రకటించిన

క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో హెచ్‌సీయూ స్థానం పదిలం

గతంలో మాదిరిగానే 651-700 శ్రేణిలో ర్యాంకు

పరిశోధనలు, సైటేషన్స్‌లో మంచి పనితీరు


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): క్యూఎస్‌ (క్వాకరెల్లీ సై మండ్స్‌) వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ - 2022లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) తనస్థానాన్ని నిలబెట్టుకొంది. మంగళవారం ప్రకటించిన క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూ 651-700 ర్యాంకుల శ్రేణిలో నిలిచింది. 2021లో కూడా హెచ్‌సీయూ ఇదే ర్యాంకుల శ్రేణిలో ఉంది. అకడమిక్స్‌, నియామకాల పరంగా లభించిన ఖ్యాతి; విద్యార్థులు - అధ్యాపకుల నిష్పత్తి, విదేశీ అధ్యాపకులు - విదేశీ విద్యార్థుల నిష్పత్తి, అధ్యాపకుల సైటేషన్స్‌ తదితర సూచీల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. మొత్తం 100 పాయింట్లకుగాను హెచ్‌సీయూ 46.1 స్కోరు సాధించింది. ఫ్యాకల్టీ సైటేషన్స్‌ విభాగంలో హెచ్‌సీయూ అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా హెచ్‌సీయూ ఇన్‌ఛార్జ్‌ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ అరుణ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. వర్సిటీ నిరంతర పనితీరుకు తాజా ర్యాంకింగ్‌ నిదర్శనమని తెలిపారు. టాప్‌-200 వర్సిటీల్లో చోటు సాధించే దిశగా బోధన, పరిశోధన తదితర విభాగాల్లో వర్సిటీ ఇంకా ప్రతిభ చాటాల్సి ఉందన్నారు. 

Updated Date - 2021-06-09T17:46:29+05:30 IST

News Hub