Share News

YV Eshwar Rao: ఏపీ పెట్రోలియం ట్యాంక్‌ ట్రక్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గా వైవీ ఈశ్వరరావు

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:50 AM

ఆంధ్రప్రదేశ్‌ పెట్రోలియం ట్యాంక్‌ ట్రక్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం శనివారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో జరిగింది.

YV Eshwar Rao: ఏపీ పెట్రోలియం ట్యాంక్‌ ట్రక్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గా వైవీ ఈశ్వరరావు

విజయవాడ(బెంజిసర్కిల్‌), మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పెట్రోలియం ట్యాంక్‌ ట్రక్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గా వైవీ ఈశ్వరరావు(విజయవాడ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పెట్రోలియం ట్యాంక్‌ ట్రక్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం శనివారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో జరిగింది. అసోసియేషన్‌ అధ్యక్షునిగా డీఆర్‌ ప్రసాద్‌(విజయవాడ), కార్యదర్శిగా ఎం.కుమారస్వామి(ఒంగోలు), కోశాధికారిగా ఆర్‌.వెంకట రమణమూర్తి రాజు(విశాఖపట్నం), ఉపాధ్యక్షులుగా జి.రమే్‌ష(గుంతకల్లు), కె.పెదకాపు(రాజమండ్రి), ఎన్‌.విజయ భాస్కర్‌రెడ్డి(కడప), సహాయ కార్యదర్శులుగా జి.రాము(ఒంగోలు), సయ్యద్‌ షమీర్‌ హుసేన్‌(చిత్తూరు), కుమ్మరి వెంగళరావు(రాజమండ్రి), కో-ఆప్టెడ్‌ ఉపాధ్యక్షునిగా గళ్లా శ్రీధర్‌(కృష్ణపట్నం), కో-ఆప్టెడ్‌ సహాయ కార్యదర్శిగా పిట్టా నాగభూషణం(విశాఖపట్నం)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రవాణా రంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేయాలని ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ను కోరుతూ సర్వసభ్య సమావేశం తీర్మానించింది.


ఇవి కూడా చదవండి..

Slap Fight: చెంపలు పగిలేగా కొట్టుకున్న బీజేపీ నేత, పోలీస్ ఆఫీసర్.. వీడియో వైరల్

DMK Leaders: హిందీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు.. డీఎంకే నేతల రియాక్షన్

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2025 | 03:50 AM