వ్యాక్సిన్ రవాణా‌.. స్టాట్‌విగ్‌తో జీఎంఆర్ ఎయిర్ కార్గో‌ ఒప్పందం

ABN , First Publish Date - 2021-03-26T19:27:59+05:30 IST

వ్యాక్సిన్ల రవాణాపై జీఎంఆర్ ఎయిర్ కార్గో అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌ ప్రత్యేక దృష్టి సారించింది. వీటి ట్రాకింగ్, పర్యవేక్షణ కోసం

వ్యాక్సిన్ రవాణా‌.. స్టాట్‌విగ్‌తో జీఎంఆర్ ఎయిర్ కార్గో‌ ఒప్పందం

హైదరాబాద్: వ్యాక్సిన్ల రవాణాపై జీఎంఆర్ ఎయిర్ కార్గో అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌ ప్రత్యేక దృష్టి సారించింది. వీటి ట్రాకింగ్, పర్యవేక్షణ కోసం నగరానికి చెందిన టెక్నాలజీ స్టార్ట్-అప్ స్టాట్‌విగ్‌తో గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన ఒప్పందంపై కార్గో టెర్మినల్‌లో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సీఈఓ సౌరభ్ కుమార్, స్టాట్‌విగ్ కో ఫౌండర్స్ సిడ్ చక్రవర్తి, నృపుల్ పొనుగోటి సంతకాలు చేశారు.  


వ్యాక్సిన్ ఎగుమతులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న హైదరాబాద్ ఎయిర్ కార్గో, ఈ భాగస్వామ్యం ద్వారా ఆధునిక బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సహాయంతో కార్గో టెర్మినల్ దగ్గర వ్యాక్సిన్లను రియల్ టైమ్‌లో పర్యవేక్షించనుంది. జీఎంఆర్ కార్గో సామర్థ్యాలు, వ్యాక్సిన్ ఎగుమతిదారులతో దాని సంబంధాలు, స్టాట్‌విగ్ బ్లాక్‌ చెయిన్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా మరిన్ని సేవలు అందించొచ్చని ఇరు సంస్థల ప్రతినిధులు తెలిపారు. భారతదేశం నుంచి ఎయిర్ కార్గో ద్వారా వ్యాక్సిన్ ఎగుమతుల సప్లై చెయిన్‌ను బలోపేతం చేయడానికి ఇవి ఉపయోగపడనున్నాయన్నారు. రాబోయే రెండేళ్లలో నగరం నుంచి 3.5 బిలియన్ మోతాదుల కోవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తి చేయటానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

Updated Date - 2021-03-26T19:27:59+05:30 IST