ప్రతి గ్రామంలో జమ్మిమొక్కను పెంచాలి
ABN , First Publish Date - 2021-10-14T05:35:01+05:30 IST
ప్రతి గ్రామంలో జమ్మిమొక్కను పెంచాలి

- జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
కందుకూరు : ప్రతి గ్రామ పంచాయతీలో జమ్మిమొక్కను పెంచాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతిల పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన జమ్మి మొక్కలను ఆయా గ్రామాల సర్పంచ్‌లకు పంపిణీ చేసి, మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల్లో మొక్కలను నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సాధ మల్లారెడ్డి, శ్రీనివాసచారి, నాయకులు ఎస్. సురేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, రాంరెడ్డి, బొక్క దీక్షిత్‌రెడ్డి, బి. వెంకటేష్, ఎంపీవో విజయలక్ష్మి, తదితరులున్నారు.