Share News

Medchal Crime News: రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం... చివరకు

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:04 AM

Medchal Crime News: మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు కొందరు దుండుగులు. ఒంటరిగా వెళ్తున్న యువతిని అడ్డుకుని ఇబ్బందులకు గురిచేశారు.

Medchal Crime News: రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం... చివరకు
Medchal Crime News

మేడ్చల్, ఏప్రిల్ 7: ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ పోలీస్‌స్టేషన్ (Medchal Police Station) పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువతిపై దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. కానీ యువతి మాత్రం భయపడిపోకుండా తనను తాను రక్షించుకునేందుకు కీచకులతో పోరాడింది.


ఇటీవల ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార ఘటన మరువక ముందు మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువతిపై దుండగులు అత్యాచారానికి యత్నించారు. అయితే యువతి ప్రతిఘటించడంతో అక్కడ నుంచి వారు పరుగులు తీశారు. మేడ్చల్ రైల్వే స్టేషన్‌ పరిధిలో ఓ యువతి ఒంటరిగా వెళ్తుండుగా ఆమెను అడ్డుకున్నారు కీచకులు. యువతిను బలవంతం చేసేందుకు ప్రయత్నించారు. అయితే యువతి కూడా ఎక్కడా తగ్గకుండా వారితో ధైర్యంగా పోరాడింది. కామాంధుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఒక్కసారిగా దుండగులు మీదకు రావడంతో వారిని అడ్డుకునేందుకు అక్కడే ఉన్న రాళ్లతో దాడి చేసి తప్పించునేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ వారు వెంటపడటంతో తీవ్రస్థాయిలో ప్రతిఘటించింది యువతి. చివరకు ఆ దుండగుల భారి నుంచి ఎలాగోలా తప్పించుకుని వెంటనే మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. పీఎస్‌లో దుండుగులు ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారు.. తాను ఎలా తప్పించుకుందో పోలీసులకు వివరించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన మేడ్చల్ రైల్వేస్టేషన్ పరిధిలో జరగడంతో ఈ కేసును రైల్వే పోలీసులకు ట్రాన్సఫర్ చేశారు మేడ్చల్ పోలీసులు.

YS Sharmila Criticizes AP Govt: నిలిచిన వైద్య సేవలు.. సర్కార్‌పై షర్మిల ఫైర్


ఈ మధ్య కాలంలో రైల్వేస్టేషన్ సమీప ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయంటూ పలు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది గంజాయి తీసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గంజాయి మత్తులో ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భద్రత పెంచాలంటూ పలు డిమాండ్‌లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మేడ్చల్‌లో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి జీఆర్పీ పోలీసులకు బదిలీ చేయగా.. వారు కేసును విచారణ జరుపుతున్నారు. కీచకులతో ప్రతిఘటిస్తున్న సమయంలో యువతికి కూడా కొంత మేర గాయాలు అవడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


ఇవి కూడా చదవండి

Deputy CM: విశాఖ గిరిజన గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటన..

Bengaluru: కామంతో కళ్లు మూసుకుపోయి.. నడి రోడ్డు మీద


Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 11:58 AM