జెండర్‌పై అవగాహన ర్యాలీ
ABN , First Publish Date - 2022-12-10T00:39:22+05:30 IST
స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యా ల యంలో శుక్రవారం జెండర్‌పై సమాఖ్య సభ్యులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డీఆర్‌డీఏ జెండర్ వివక్షపై స్వయం సహాయ బృందాల సభ్యులకు అవగాహన కల్పించారు. వారందరితో గ్రామంలో ర్యాలీ నిర్వహిం చారు.
కోరుకొండ, డిసెంబరు 9: స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యా ల యంలో శుక్రవారం జెండర్‌పై సమాఖ్య సభ్యులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డీఆర్‌డీఏ జెండర్ వివక్షపై స్వయం సహాయ బృందాల సభ్యులకు అవగాహన కల్పించారు. వారందరితో గ్రామంలో ర్యాలీ నిర్వహిం చారు. రాజమహేంద్రవరం డిస్ర్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులు పాల్గొని ఆడపిల్లల అక్రమ రవాణా అరికట్టడం, ఆడ, మగ పెంపకంలో తేడా, గృహ హింస, బాల్య వివాహాలు, వరకట్న సమస్యలపై అవగాహన కలిగించారు. ప్రతి మండల సమాఖ్య పరిధిలో మహిళా రీసోర్స్‌పర్సన్లను ఏర్పాటు చేసి మహిళలపై జరిగే అన్యాయాలను జెండర్ సోషల్ యాక్షన్ కమిటీ ద్వారా పరిష్కరించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కె.పెద్దిరాజు, వుల్లి బుజ్జిబాబు, ఎంఈవో డి.కుశలవదొర, జి.శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు.