Jagan: మైనింగ్‌ ఏరియాలో కార్యకలాపాలు మొదలుపెట్టండి

ABN , First Publish Date - 2022-11-14T17:48:51+05:30 IST

ఆదాయం వచ్చే శాఖలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JaganMohan Reddy) సమీక్షించారు. పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.

Jagan: మైనింగ్‌ ఏరియాలో కార్యకలాపాలు మొదలుపెట్టండి
Cm Jagan ,Ap

అమరావతి (Amaravathi): ఆదాయం వచ్చే శాఖలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JaganMohan Reddy) సమీక్షించారు. పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కల్పించాలని, బెల్టుషాపులు, అక్రమ మద్యం తయారీ, విక్రయాల నిర్మూలనపై ఎస్‌ఈబీ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. గంజాయి, అక్రమ మద్యం కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్‌ అన్నారు. ఏజెన్సీలో అర్హులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇవ్వాలని, శాశ్వత భూ హక్కు, భూసర్వేపై అవగాహన కల్పించాలని అధికారులకు జగన్‌ స్పష్టంగా చెప్పారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్‌ ఏరియాలో కార్యకలాపాలు మొదలుపెట్టాలని జగన్‌ ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - 2022-11-14T17:48:53+05:30 IST