MLA Vasantha Krishnaprasad: 16 నెలల కార్యాచరణపై జగన్ దిశానిర్దేశం
ABN , First Publish Date - 2022-12-15T19:21:11+05:30 IST
మైలవరం నియోజకవర్గ నేతలతో సీఎం జగన్ (Jagan) సమీక్షించారు.
ఎన్టీఆర్: మైలవరం నియోజకవర్గ నేతలతో సీఎం జగన్ (Jagan) సమీక్షించారు. మైలవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, అభివృద్ది సంక్షేమ పథకాలు, సమస్యలపై సీఎం చర్చించారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (MLA Vasantha Krishnaprasad) తెలిపారు. గడచిన మూడున్నరేళ్లలో నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చెప్పారని,.. 16 నెలల కార్యాచరణపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారని ఎమ్మెల్యే చెప్పారు. మైలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారని కృష్ణప్రసాద్ వెల్లడించారు. పార్టీలో సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని ఆదేశించారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.