నలంద విద్యానికేతన్‌లో న్యూ ఇయర్ వేడుకలు
ABN , First Publish Date - 2022-12-31T00:22:55+05:30 IST
నలంద విద్యానికేతన్‌లో 2022 సంవత్స రానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుక్ర వారం విద్యార్థులు వేడుకలను నిర్వహిం చారు.
నలంద విద్యానికేతన్‌లో న్యూ ఇయర్ వేడుకలు
గవర్నర్‌పేట, డిసెంబరు 30: నలంద విద్యానికేతన్‌లో 2022 సంవత్స రానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుక్ర వారం విద్యార్థులు వేడుకలను నిర్వహిం చారు. న్యూఇయర్ కార్నివాల్‌ను స్కూల్ ప్రిన్సిపాల్ మాదల పద్మజ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా మ్యాజిక్ షో, సెల్ఫీస్టాల్, గన్ షూటింగ్, రింగ్ గేమ్, కంప్యూటర్ గేమ్, ఓపెన్ డీజె వంటి పలు ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు. టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ విద్యార్థులతో కలిసి డీజెలో పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ పద్మజ విద్యార్థులకు, తల్లిదండ్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.