Share News

Investigation: సీఐడీ విచారణకు జోగి రమేష్

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:17 PM

అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని ఆయన ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ శుక్రవారం ఉదయం సిఐడి విచారణకు హాజరయ్యారు. అతనితో పాటు మరో ఐదుగురు కూడా హాజరయ్యారు.

Investigation: సీఐడీ విచారణకు జోగి రమేష్
Former minister Jogi Ramesh

విజయవాడ: వైసీపీ నేత (YCP Leader), మాజీ మంత్రి జోగి రమేశ్ (Former minister Jogi Ramesh) తెలుగుదేశం అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) నివాసంపై దాడి కేసులో సిఐడి (CID) విచారణకు (investigation) హాజరయ్యారు. ఆయనతో సహా ఐదుగురు నిందితులు కూడా హాజరయ్యారు. శుక్రవారం ఉదయం విజయవాడ రీజనల్ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అధికారులు వారిని విచారిస్తున్నారు. కాగా వైసీపీ (YCP) అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన రమేష్ భారీ కాన్వాయ్‌తో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. విజయవాడలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని రమేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.

Also Read..: కన్నప్ప సినిమాపై మనోజ్ సెటైరికల్ ట్వీట్..


వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటికి జోగి రమేష్ తన అనుచరులతో వచ్చి హంగామా సృష్టించారు. దీనిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదయింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారంొ సీఐడీ అధికారులు విచారణకు రావాల్సిందిగా జోగి రమేష్‌ను పిలిచారు. దీంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయయారు. చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం 20 మందికి పైగా కేసులు నమోదు చేసింది. వీరిలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. అయితే చంద్రబాబు ఇంటిపై దాడి చేసే నాటికి జోగి రమేష్ కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఈ కేసులో వారిని ఇప్పటికే పోలీసులు పలుమార్లు విచారించారు. అయితే ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా సుప్రీం కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే దేశం విడిచి వెళ్లొద్దని, పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని కోర్టు ఆంక్షలు విధించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నయీం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం..

గోరంట్లపై తాడేపల్లి పీఎస్‌లో కేసు

ఒంటిమిట్ట కోదండరామునికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు

Updated Date - Apr 11 , 2025 | 01:17 PM