Share News

YS Sharmila: వైఎస్ భారతీపై అనుచిత వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:05 PM

YS Sharmila: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

YS Sharmila: వైఎస్ భారతీపై అనుచిత వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి
YS Sharmila

విజయవాడ: రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగవద్దని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి మీద సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. సోషల్ మీడియాలో భారతి రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని చెప్పారు. ఇవాళ(శుక్రవారం) విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు.


సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడే వాళ్లపై, రేటింగ్స్ కోసం ఎంటర్‌టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని వైఎస్ షర్మిల హెచ్చరించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాజం ఇలాంటి మకిలీ చేష్టలను హర్షించదని చెప్పారు. ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలని అన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉందని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ విష సంస్కృతికి బీజం వేయొద్దని వైఎస్ షర్మిల అన్నారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే వాళ్లపై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలా చేయడం తగదని చెప్పారు. కొంతమంది రక్త సంబంధాన్ని మరిచారని.. మనిషి పుట్టుకను సైతం అనుమానించి రాక్షసానందం పొందారని విమర్శించారు. అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం ఇందులోకి తీసుకురావడం బాధ కలిగిస్తోందని చెప్పారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని వైఎస్ షర్మిల కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: బిజీబిజీగా సీఎం చంద్రబాబు షెడ్యూల్.. ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటన

ఫోటోషూట్లలోనే ఇదో కొత్త తరహా..

Madhav Police Clash: పోలీసులపై గోరంట్ల మాధవ్‌ దౌర్జన్యం

Purandeswari: పోలీసులకు జగన్‌ క్షమాపణ చెప్పాలి

Jagan : చంద్రబాబూ చర్యకు ప్రతిచర్య తప్పదు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 11 , 2025 | 01:19 PM