కామాక్షితాయి ఆలయంలో హుండీల లెక్కింపు
ABN , First Publish Date - 2022-12-06T23:10:49+05:30 IST
మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో మంగళవారం హుండీల లెక్కింపు జరిగింది.
బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు6: మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో మంగళవారం హుండీల లెక్కింపు జరిగింది. 74 రోజులకు గాను భక్తులు హుండీల ద్వారా సమర్పించుకున్న కానుకల ద్వారా 44లక్షలా 49వేలా 710 రూపాయలు మేర ఆలయానికి ఆదాయం చేకూరినట్టు ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రమణ్యంనాయుడు, ఏసీ,ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు తెలిపారు. 64.200 గ్రాముల బంగారు, 515.500 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక యూఎస్‌ఏ, పది సింగపూర్ డాలర్లు భక్తులు సమర్పించుకున్నట్టు వారు తెలిపారు. అన్నదానం హుండీల ద్వారా ఒక లక్షా 75 వేలా 862 రూపాయలు వచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయశాఖ ఏసీ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కోవూరు డివిజన్ ఇన్స్‌పెక్టర్ ఎం. సుధీర్, సభ్యులు నందకుమార్, శివకుమార్, శశిశేఖర్ శర్మ, స్థానిక బ్యాంకు మేనేజరు శివకుమార్, అప్రైజర్ కేఎన్‌బీ సింగ్, సిబ్బంది, నెల్లూరు నుంచి పలువురు స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా విశ్రాంత ఉద్యోగులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
కామాక్షితాయిని దర్శించుకున్న రామానందభారతి
విశాఖపట్టణంలోని భువనేశ్వరి పీఠం రామానందభారతి స్వామి మండలంలోని జొన్నవాడ ఆలయంలో శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయిలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, ఏసీ, ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు, సభ్యులు నందకుమార్, శివకుమార్, సిబ్బంది, భక్తులను స్వామి ఆశీర్వదించారు.