కార్మిక శాఖ అధికారుల దాడులు

ABN , First Publish Date - 2022-09-22T04:00:44+05:30 IST

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ అప్పారావు ఆదేశాల మేరకు బుధవారం కావలి పట్టణంలో జిల్లాస్థాయి కార్మిక శాఖ అధికారులు రామారావు, హరిబాబు, ఎన్‌సీఎల్‌పీ అధికారి అనిల్‌ తదితరులు పలు దుకాణాలపై దాడులు చేశారు.

కార్మిక శాఖ అధికారుల దాడులు
దుకాణ యజమానులతో మాట్లాడుతున్న కార్మికశాఖ అధికారులు

పలువురిపై కేసుల నమోదు

కావలి, సెప్టెంబరు 21: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ అప్పారావు ఆదేశాల మేరకు బుధవారం కావలి పట్టణంలో జిల్లాస్థాయి కార్మిక శాఖ అధికారులు రామారావు, హరిబాబు, ఎన్‌సీఎల్‌పీ అధికారి అనిల్‌ తదితరులు పలు దుకాణాలపై దాడులు చేశారు. బాలలతో పనులు చేయించుకుంటున్న పలు దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాల కార్మికలతో ఎవరైనా పనులు చేయించుకుంటున్నట్లు తమ దృష్టికి వస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వారి వెంట బచ్పన్‌బచావో ఆందోళన్‌ చంద్రశేఖర్‌, సీఏసీఎల్‌ జిల్లా కన్వీనర్‌ అబ్దుల్‌ అలీం, సభ్యుడు బ్రహ్మయ్య, ప్రియదర్శిని మహిళామండలి చైర్‌పర్సన్‌ ఖాదర్‌బీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-22T04:00:44+05:30 IST