Share News

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి ఇంటికి పోలీసులు.. ఎందుకంటే

ABN , Publish Date - Mar 30 , 2025 | 06:39 PM

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకణి గోవర్దన్ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు ఆదివారం నాడు వెళ్లారు. అయితే ఇంట్లో కాకణి లేకపోయే సరికి అతని కోసం అన్వేషణ చేస్తున్నారు.

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి ఇంటికి పోలీసులు.. ఎందుకంటే
Kakani Govardhan Reddy

నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంటి వద్ద ఆదివారం నాడు ఏపీ పోలీసులు చేరుకున్నారు. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్ధాల వినియోగం, రవాణా కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసులు వస్తున్నారని కాకాణి ముందుగానే సమాచారం తెలుసుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాకాణికి చెందిన రెండు ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి.


ఇళ్లలో ఒక్కరూ లేకపోవడంతో పోలీసులు అయోమయంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మీడియాతో మాట్లాడారు. అక్రమ మైనింగ్ కేసులో విచారణ నిమిత్తం నోటీసులు ఇవ్వడానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి వచ్చామని తెలిపారు. కాకాణి, ఆయన పీఏకు ఫోన్లు చేస్తే స్విచ్ఛాఫ్ వస్తున్నాయని అన్నారు. నోటీసుల ప్రకారం ఈ నెల 31వ తేదీ 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉందని ఎస్ఐ హనీఫ్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..

Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..

TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్‌

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 09:52 PM