Share News

Pawan Kalyan : చంద్రబాబు పనితీరుకు ఇదే నిదర్శనం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 30 , 2025 | 07:26 PM

Pawan Kalyan: సీఎం చంద్రబాబు లాంటి విజనరీకి మనందరం అండగా ఉండాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే కూటమికి మద్దతు ఇచ్చానని అన్నారు.

Pawan Kalyan :  చంద్రబాబు పనితీరుకు ఇదే నిదర్శనం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan

అమరావతి: పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే ఈ పీ4 కార్యక్రమం చేపట్టామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు లాంటి విజనరీకి మనందరం అండగా ఉండాలని పవన్ కల్యాణ్ చెప్పారు. 164 ఎమ్మెల్యేలతో, 21 పార్లమెంట్ సభ్యులను గెలిపించారని.. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే కూటమికి మద్దతు ఇచ్చానని అన్నారు. సరిగ్గా సంవత్సరానికి ముందు తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నామని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.


పీ4 కార్యక్రమాన్ని ఆదివారం నాడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ప్రారంభించారు. పీ4 లోగో, పోర్టల్‌ను చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఆవిష్కరించారు. జీరో పావర్టీ లక్ష్యంగా పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌ మోడల్‌‌‌ను ఏర్పాటు చేశారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.


చంద్రబాబు అత్యంత సమర్థవంతమైన నాయకుడని పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీని అభివృద్ధి చేస్తారనే చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని చెప్పారు. రాబోయే తరం గురించి కూడా ఆలోచించే నాయకుడు చంద్రబాబు అని తెలిపారు. తెలుగు ప్రజలు బాగుండాలనేదే తమ ఆకాంక్ష అని చెప్పారు.గత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. చంద్రబాబు సీఎం అయ్యాక కార్మికుల జీవితాల్లో మార్పు వచ్చిందని అన్నారు. చంద్రబాబు సారథ్యంలో ఏపీ స్వర్ణాంధ్రగా మారుతుందని ఉద్ఘాటించారు. ఎదుగుతున్న సమయంలో మంచి సలహాలు ఇచ్చేవారు ఉండాలని అన్నారు. మంచి సలహాలు ఇస్తే యువత అద్భుతాలు సృష్టిస్తారని వ్యాఖ్యానించారు. పీ4 వల్ల లక్షలాది మంది కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయనిపవన్ కల్యాణ్ వెల్లడించారు.


ఇందులో ప్రభుత్వం, పబ్లిక్, ప్రైవేటు వ్యక్తులు ఉంటారని పవన్ కల్యాణ్ వివరించారు. ఉగాదికి చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుందని అన్నారు. ఒక నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తారని చెప్పారు. ఒక నిజమైన లీడర్ వచ్చే తరం కోసం ఆలోచిస్తారని అన్నారు. సీఎం చంద్రబాబు వెనుక తాము ఎందుకు ఉన్నామంటే ఆయన ఒక తరం కోసం కాదని.. రెండు మూడు తరాల కోసం ఆలోచిస్తారని ఉద్ఘాటించారు. కోటి 70 లక్షల మంది నుంచి 30 లక్షల కుటుంబాలను గ్రామ సభల ద్వారా ఎంపిక చేశారని పవన్ కల్యాణ్ చెప్పారు.


ఎన్టీఆర్ కింది స్థాయి నుంచి వచ్చారని.. మచ్చా ప్రకాశ్ తాను చదువుకోకపోయినా వాళ్ల అక్క చదువుకోవాలని అన్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తోంది... ప్రకాశ్ కూడా చదువుకోవాలని అని చెప్పారు. ప్రకాశ్ త్యాగం చేయకూడదనే తాను కూడా కోరుకుంటున్నానని అన్నారు. సినిమాలో ఏదైనా సమస్యను రెండున్నర గంటల్లో పరిష్కారించవచ్చని... అయితే నిజజీవితంలో అది చాలా కష్టమని తెలిపారు. ఒక విజనరీ లీడర్ పూనుకుంటే ఎంత అద్బుతంగా పథకం ఉంటుందో ఇదే నిదర్శనమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..

Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..

TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్‌

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 08:19 PM