ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీదే విజయం
ABN , First Publish Date - 2022-12-06T01:27:47+05:30 IST
రాష్ట్రంలో ఎప్పుడూ సార్వత్రిక ఎన్నికలు వచ్చినా, టీడీపీ విజయం తధ్యమని చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అవుతాడని మాజీ ఎమ్మె ల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

మార్కాపురం, డిసెంబరు 5: రాష్ట్రంలో ఎప్పుడూ సార్వత్రిక ఎన్నికలు వచ్చినా, టీడీపీ విజయం తధ్యమని చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అవుతాడని మాజీ ఎమ్మె ల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణం లోని 7,8 వ వార్డులలో సోమవారం ‘రాష్ట్రానికి ఇదేంఖర్మ’ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అదే విధంగా ప్రజల సమస్య లను అడిగి తెలుసుకున్నారు. పలకల పరిశ్రమ దెబ్బతినడంతో అసలే పనులు కోల్పోయామని, ప్రభుత్వ పింఛన్లు సైతం రద్దు చేశారని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కార్య క్రమంలో నియోజకవర్గ పోల్‌మేనేజ్‌మెంట్ కోఆర్డినేటర్ కందుల రామిరెడ్డి, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారా యణ, టీడీపీ నాయకులు అల్లంపల్లి శ్రీని వాసులు, మాజీ కౌన్సిలర్లు సయ్యద్ గఫార్, పాల్గొన్నారు.
పొదిలి రూరల్ : రాష్ట్రానికి వైసీపీ పాలన తోనే ఖర్మ పట్టిందని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పొదిలి పట్టణంప్రధాన వీధుల్లోని దుకాణా దారులతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన అన్యాయాన్ని వివరిస్తూ ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని రకాల వ్యాపారాలపై ఏ రాష్ట్రంలో లేని విధం గా పన్నులు వేస్తూ వ్యాపారులను కోలుకోలేని దెబ్బతీశారని విమర్శిం చారు. గత ప్రభుత్వంలో కరెంట్ బిల్లులు ప్రతి నెల 1వ తేదీన రీడింగ్ తీసేవారని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నాలుగు, ఐదు రోజుల తరువాత తీసి ఎక్కువ యూనిట్లు చూపించి సంక్షేమ పథకాలు తొలగించి ప్రజలను మోసం చేస్తుందన్నారు. రీసర్వే పేరుతో గ్రామాల్లో గొడవలకు ఆజ్యం పోస్తున్నారని ఎద్దేవ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కాటూరి పెదబాబు, మాజీ సర్పంచ్ స్వర్ణగీత, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఇమాంమ్ సా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుణుపూడి భాస్కర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.