AP News: టీడీపీ కండువా కప్పుకున్న గవరంపేట వైసీపీ కార్యకర్తలు
ABN , First Publish Date - 2022-11-11T15:02:17+05:30 IST
జిల్లాలోని బుట్టాయగూడెం మండలం గవరంపేట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.

పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయగూడెం మండలం గవరంపేట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam srinivasulu) వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొరగం మాట్లాడుతూ... పార్టీలో కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని అన్నారు. పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే ప్రతిఒక్కరికీ గుర్తింపు ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా తీసుకుంటానని అన్నారు.
కట్టం చిన్నలక్ష్మి, కట్టం లక్ష్మీదేవి, కొర్శా వీరమ్మ, కోర్శా గంగమ్మ, కుంజ లక్ష్మి, కోర్శ దుర్గమ్మ, కట్టం సుబ్బలక్ష్మి, కొర్శ గంగాదేవి, కోర్శ బొజ్జమ్మ, మడకం ముత్యాలమ్మ, కట్టం మేరీ, కట్టం రాజమ్మ, పాయం వెంకమ్మ, కోర్స రాముడు, మడకం దూలయ్య, కట్టం చిన్నయ్య, కట్టం బెల్లారావు, కట్టం దుర్గారావు, మడకం దుర్గారావు, కోర్శ బుచ్చిరాజు, ఉడత కన్నయ్య, మడకం శింగరాజు, మల్లి రాము టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు మడకం రామకృష్ణ, దువ్వెల సంకురు, యూకేడీ బాబు, దువ్వెల దుర్గారావు, కేసరి ఆదినారాయణ, చిలకముడి సుధాకర్, పసుమర్తి భీమేశ్వరరావు, బొబ్బర ఎలీషా, గార్లు తదితరులు ఉన్నారు.