Nandakumar: నూతన పరిశోధనలతో విద్యార్థులు ముందుకెళ్లాలి
ABN , First Publish Date - 2022-11-25T10:59:59+05:30 IST
ఇంజనీరింగ్ పట్టభద్రులు సరికొత్త పరిశోధనలతో ముందుకెళ్లాలని ఆదాయపు పన్ను శాఖ అడిషినల్ కమిషనర్ పి.నందకుమార్(P. Nandakumar) పేర్కొన్నా
- ఇన్‌కం టాక్స్ అడిషినల్ కమిషనర్ నందకుమార్
ప్యారీస్(చెన్నై), నవంబరు 24: ఇంజనీరింగ్ పట్టభద్రులు సరికొత్త పరిశోధనలతో ముందుకెళ్లాలని ఆదాయపు పన్ను శాఖ అడిషినల్ కమిషనర్ పి.నందకుమార్(P. Nandakumar) పేర్కొన్నారు. స్థానిక షోలింగనల్లూర్ నియోజకవర్గంలోని పాత మహాబలిపురం రోడ్డులో ఉన్న సెయుంట్ జోసఫ్ గ్రూప్ విద్యాసంస్థల స్నాతకోత్సవం గురువారం సంస్థల చైర్మన్ బి.బాబు మనోహరన్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. సెయింట్ జోసఫ్ ఇంజనీరింగ్ కళాశాల 22,23,24వ గ్రాడ్యుయేషన్ సందర్భంగా మొత్తం 4,205 మంది విద్యార్థులకు, 3,937 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, 268 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, అన్నా వర్సిటీ ర్యాంక్ హోల్డర్లు 177 మందికి ముఖ్యఅతిథి వి.నందకుమార్ సర్టిఫికెట్లు అందజేశారు. సెయింట్ జోసఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 5,6,7 గ్రాడ్యుయేషన్ సందర్భంగా 989 మందికి పట్టాలు, 9 మంది అన్నా వర్సిటీ ర్యాంకర్లకు షీల్డు, రజత పతకాలు అందజేశారు. ఈ వేడుకల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.శశిశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.జెస్సీ ప్రియ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.వడ్డి శేషగిరిరావు, టెక్నాలజీ సంస్థ ప్రిన్సిపాల్ డా.పి.రవిచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ర్యాంకర్లకు రూ.30 లక్షల నగదు బహుమతిని చైర్మన్ డా.బాబు మనోహరన్ అందజేసి అభినందించారు.