క్యాబ్, ఆటో.. రైడ్‌ను రద్దు చేస్తే రూ.500 ఫైన్.. నేటి నుంచే అక్కడ కొత్త ట్రాఫిక్ రూల్స్!
ABN , First Publish Date - 2022-10-28T16:14:11+05:30 IST
ప్రస్తుతం రవాణా సౌకర్యం చాలా సులభతరంగా మారింది. నగరాల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే.. ఒకప్పుడు లోకల్ ట్రైన్లు, బస్సులు, ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం జస్ట్ స్మార్ట్ ఫోన్‌లో ఇలా ప్రెస్ చేయగానే.. అలా వాహనాలు మన వద్దకే వచ్చి వాలుతున్నాయి. బైకులు, ఆటోలు, కార్లు.. ఇలా..
ప్రస్తుతం రవాణా సౌకర్యం చాలా సులభతరంగా మారింది. నగరాల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే.. ఒకప్పుడు లోకల్ ట్రైన్లు, బస్సులు, ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం జస్ట్ స్మార్ట్ ఫోన్‌లో ఇలా ప్రెస్ చేయగానే.. అలా వాహనాలు మన వద్దకే వచ్చి వాలుతున్నాయి. బైకులు, ఆటోలు, కార్లు.. ఇలా వారి వారి ఆర్థిక స్తోమతను బట్టి బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొందరు తీరా వాహనం దగ్గరికి వచ్చే సమయంలో రైడ్‌ని క్యాన్సిల్ చేస్తుంటారు. అలాగే వాహనదారులు కూడా.. తమ రైడ్‌ను చివరి నిముషంలో రద్దు చేసుకుంటుంటారు. అయితే ఇకపై ఇలాంటి పనులు చేస్తే రూ.500 జరిమానా తప్పదంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడులో నేటి (శుక్రవారం) నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి..
సముద్రం మధ్యలో ఊహించని ప్రమాదం.. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటుండగా.. వెనక్కు తిరిగి చూస్తే..
తమిళనాడులో (Tamil Nadu) అక్టోబర్ 28నుంచి ట్రాఫిక్ రూల్స్‌లో (Traffic Rules) చాలా మార్పులు చేశారు. ఈ నిబంధనల ప్రకారం.. క్యాబ్, ఆటో తదితర వాహనాలను బుక్ (Auto, Cab Bookings) చేసుకునే సమయంలో చివరి నిముషంలో రైడ్‌ని రద్దు చేస్తే.. రూ.50 నుంచి రూ.500వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. చివరి నిముషంలో రైడ్‌లను రద్దు చేసే కేసులు ఇటీవల కుప్పలు తెప్పలుగా వస్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే కొత్త నిబంధనల ప్రకారం.. బైక్ నడుపుతున్న సమయంలో మొబైల్, ట్యాబ్, మ్యూజిక్ ప్లేయర్ ఉపయోగిస్తే.. రూ.1000లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కేసులో రెండో సారి పట్టుబడితే రూ.10,000 వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇక లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే.. రూ.5,000, సిగ్నల్ జంపింగ్ కేసులో మొదటిసారి రూ.1000, రెండోసారి రూ.10,000లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది అంబులెన్స్ (Ambulance), అగ్నిమాపక తదితర అత్యవర వాహనాలకు దారి ఇవ్వకుండా వెళ్తుంటారు. ఇకపై ఇలా చేస్తే.. రూ.10,000 జరిమానా విధించనున్నారు.
26 ఏళ్ల క్రితం చేసిన వీర్యదానం.. 47 ఏళ్ల వయసులో అతడిని ఓ బిడ్డకు తండ్రిని చేసింది..!
అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ (Rash driving) చేస్తే మొదటి సారి రూ.1,000లు.. రెండో సారి రూ.10వేల ఫైన్ పడుతుంది. మరోవైపు రేసింగ్‌పై కూడా అధికారులు కఠిన నిబంధనలు విధించారు. రోడ్డుపై రేసింగ్ చేస్తూ దొరికితే మొదటిసారి.. రూ.15వేలు, రెండోసారి రూ.25వేలు చెల్లించాల్సి ఉంటుంది. కొందరు యువకులు తమ బైకులకు ఉన్న సైలెన్సర్లను తొలగించి, విపరీతమైన సౌండ్ వచ్చేలా మార్పులు చేయిస్తుంటారు. తద్వారా మిగతా వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇలాంటి పనులు చేస్తే.. ఇకపై రూ.1000 చలాన్ పడుతుంది. ఇక మద్యం తాగి పట్టుబడితే రూ.10,000 జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనలు దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
మతిమరుపు తెచ్చిన అదృష్టం.. 67ఏళ్ల వయసులో కోటీశ్వరుడు ఎలా అయ్యాడంటే..