‘వనజీవి’కి పవనకళ్యాణ్ పరామర్శ
ABN , First Publish Date - 2022-05-23T05:46:44+05:30 IST
‘వనజీవి’కి పవనకళ్యాణ్ పరామర్శ

త్వరలోనే కలవడానికి వస్తానన్న జనసేన అధినేత
వీడియోకాల్ ద్వారా ఆరోగ్యం గురించి ఆరా
ఖమ్మం కలెక్టరేట్, మే 22: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వనజీవి రామయ్యను జననేత అధినేత పవనకళ్యాణ్ వీడియోకాల్ ద్వారా పరామర్శించారు. త్వరలోనే ఇంటికి వచ్చి కలుస్తానన్నారు. ‘వనజీవి’ దరిపల్లి రామయ్య ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న పవనకళ్యాణ్ ఆదివారం తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సుమనను ఖమ్మం జిల్లా ఆస్పత్రికి పంపించారు. క్రమంలో డాక్టర్ సుమన వనజీవి రామయ్యను కలిసి.. పవనకల్యాణ్‌తో వీడియోకాల్‌లో మాట్లాడించారు. ఈ సందర్భంగా పవనకళ్యాణ్ రామయ్యతో మాట్లాడుతూ.. మీ ఆరోగ్యం ఎలా ఉంది.. కోటి మొక్కలు నాటిన మీరే నాకు ఆదర్శం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మీ ఆరోగ్యం కుదుటపడగానే మిమ్ముల్సి వ్యక్తిగతంగా వచ్చి కలుస్తా అని చెప్పారు. దీనికి రామయ్య మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాను హైదరాబాద్‌కు జూన 5న రానున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో వైద్య చికిత్సలు అందిస్తున్న ఏవో డాక్టర్ రాజశేఖర్‌తో పవన కళ్యాణ్ మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. రామయ్య త్వరలో కోలుకుంటారని, కొద్దిరోజులపాటు విశ్రాంతి అవసరం ఉంటుందని వివరించారు.