ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆందోళన

ABN, Publish Date - Dec 25 , 2023 | 02:48 PM

తాడిపత్రి ( Tadipatri ) లోని సీబీ రోడ్డులో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ( JC Prabhakar Reddy ) ఆందోళనకు దిగారు. నూతన సంవత్సర వేడుకల కోసం డివైడర్ల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాలకు మునిసిపల్ ఉద్యోగులు విద్యుత్తు దీపాలు అలంకరిస్తున్నారు. అడ్డుగా ఉన్న వైసీపీ జెండాలను మున్సిపల్ సిబ్బంది తొలగించడానికి ప్రయత్నం చేశారు.

అనంతపురం: తాడిపత్రి ( Tadipatri ) లోని సీబీ రోడ్డులో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ( JC Prabhakar Reddy ) ఆందోళనకు దిగారు. నూతన సంవత్సర వేడుకల కోసం డివైడర్ల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాలకు మునిసిపల్ ఉద్యోగులు విద్యుత్తు దీపాలు అలంకరిస్తున్నారు. అడ్డుగా ఉన్న వైసీపీ జెండాలను మున్సిపల్ సిబ్బంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ జెండాలను తొలగించకూడదని మున్సిపల్ సిబ్బందికి వైసీపీ నేతలు అడ్డుపడ్డారు.

ఈ విషయం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలియడంతో కాంచన హాస్పిటల్ వద్దకు వచ్చారు. వైసీపీ జెండాలను తొలగించి లైట్లు వేయాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ సిబ్బందికి సూచించారు. అలాగే వైసీపీ జండాలను తొలగించవద్దని ఎస్ఐ గౌస్ మునిసిపల్ ఉద్యోగులకు అడ్డుపడ్డారు. అయితే మరోసారి అక్కడికి జేసీ ప్రభాకర్‌రెడ్డి చేరుకుని ఎస్ఐ గౌస్ తీరుపై రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో తాడిపత్రిలో కొద్దిసేపు కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా.. ట్రైనీ డీఎస్పీ హామీతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆందోళన విరమించారు.

Updated Date - Dec 25 , 2023 | 02:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising