Temperature: మండిన ఏపీ
ABN , First Publish Date - 2023-04-16T21:52:23+05:30 IST
రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఎండతీవ్రతకు మండిపోయాయి. ఆదివారం ఉదయం నుంచే వడగాడ్పులు వీయడంతో ప్రజలు ఠారెత్తిపోయారు. పడమర గాలులు ప్రభావంతో రాష్ట్రంలో
విశాఖపట్నం: రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఎండతీవ్రతకు మండిపోయాయి. ఆదివారం ఉదయం నుంచే వడగాడ్పులు వీయడంతో ప్రజలు ఠారెత్తిపోయారు. పడమర గాలులు ప్రభావంతో రాష్ట్రంలో 17 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 100 మండలాల్లో వడగాడ్పులు వీశాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని అనకాపల్లి, కాకినాడ (Anakapalli Kakinada), విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా వుంది. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండడంతో వేడి వాతావరణానికి ప్రజలు తాళలేకపోతున్నారు. వడగాడ్పులతో బయటకు వెళ్లలేక ఇళ్లల్లో వుండిపోవవడంతో ఉక్కపోత, వేడి గాలులతో ఇబ్బందిపడ్డారు. కాగా చిత్తూరు జిల్లా (Chittoor District) పాలసముద్రంలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఐదు రోజుల వరకు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది. ఇదిలావుండగా ఆదివారం ఉత్తరకోస్తా ఏజెన్సీ ప్రాంతంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.