Share News

రైతులు బాగుండాలి, చంద్రబాబు విడుదల కావాలి

ABN , First Publish Date - 2023-10-23T02:16:19+05:30 IST

‘దేశంలో రైతులు బాగుండాలి. చంద్రబాబు త్వరగా విడుదల కావాలి’’ అని అమ్మవారిని కోరుకున్నా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. దుర్గాదేవి అలంకారంలో ఉన్న

రైతులు బాగుండాలి, చంద్రబాబు విడుదల కావాలి

అమ్మవారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడు

విజయవాడ, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలో రైతులు బాగుండాలి. చంద్రబాబు త్వరగా విడుదల కావాలి’’ అని అమ్మవారిని కోరుకున్నా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. దుర్గాదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం దర్శించుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబుపై అన్యాయంగా కేసులు నమోదు చేసి 44 రోజులుగా జైల్లో పెట్టారు. ఆయన త్వరలో కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. దేశంలో రైతులు కరువుతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందెప్పుడూ లేదు. రాష్ట్రంలో పశువులకు గ్రాసం లేని పరిస్థితి ఏర్పడింది. కరువు బారి నుంచి రైతులను బయట పడేయాలని అమ్మవారిని కోరుకున్నా’’ అని అచ్చెన్న తెలిపారు.

Updated Date - 2023-10-23T02:16:19+05:30 IST