ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nimmala Ramanaidu: జగన్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల భయం పట్టుకుంది

ABN, First Publish Date - 2023-03-09T15:32:50+05:30

సీఎం జగన్‌కు (CM JAGAN) ఎమ్మెల్సీ ఎన్నికల భయం పట్టుకుందని టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిరుపతి: సీఎం జగన్‌కు (CM JAGAN) ఎమ్మెల్సీ ఎన్నికల భయం పట్టుకుందని టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎన్నికల్లో ఓట్లు వేయరని ప్రభుత్వానికి అర్థమైందన్నారు. అందుకే దొంగ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC election) గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 40 వేలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేశారని తెలిపారు. ఒక్క తిరుపతి నగరంలోనే 15 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నట్లు ఆధారాలున్నాయని చెప్పుకొచ్చారు. అధికారులకు ఆధారాలు చూపించినా ఎందుకు దొంగ ఓట్లను తొలగించడం లేదని నిమ్మల రామానాయుడు వాపోయారు.

ఇదిలా ఉంటే తెలుగు దేశం (TDP) నేతలు దొంగ ఓటర్ల భరతం పట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఓటర్ లిస్ట్ (Voter list) ఆధారంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. దొంగ నోట్ల నమోదుకు కొందరు వ్యక్తులు ఫేక్ సర్టిఫికెట్లను సమర్పించారు. ఫేక్ సర్టిఫికెట్లను ధృవీకరిస్తూ సంతకం చేసిన విద్యుత్ శాఖ ఏఈని నేతలు గుర్తించారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. ఏఈని కలిసే ప్రయత్నం చేశారు. కానీ టీడీపీ నేతల రాకను ముందుగానే గుర్తించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు.

ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: కవిత లిక్కర్ స్కామ్ చేస్తే తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం?

Updated Date - 2023-03-09T15:32:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising