అసలేం జరుగుతోంది!
ABN , First Publish Date - 2023-10-15T00:55:05+05:30 IST
సెంట్రల్ జైలులో అసలేం జరుగుతోంది..అంతటా అయోమయం.. అటు నాయకులు.. ఇటు ప్రజల్లో ఏదో తెలియని భయం.. చంద్రబాబు ఎలా ఉన్నారో.. ఏం చేస్తున్నారోననే ఆందోళన సర్వత్రా నెలకొంది..

33 రోజులుగా జైలులోనే బాబు
అధికారులంతా అటెన్షన్
రెండు రోజులుగా హడావుడి
హెల్త్ బులిటెన్ విడుదల..ప్రెస్‌మీట్లు
ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన
బాబును చూపించాలని డిమాండ్
సెంట్రల్ జైలులో అసలేం జరుగుతోంది..అంతటా అయోమయం.. అటు నాయకులు.. ఇటు ప్రజల్లో ఏదో తెలియని భయం.. చంద్రబాబు ఎలా ఉన్నారో.. ఏం చేస్తున్నారోననే ఆందోళన సర్వత్రా నెలకొంది.. ఒక పక్క జైలు అధికారులు ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నా ఎందుకో నమ్మశక్యం కావడంలేదనేది ప్రజల వాదన.. జీజీహెచ్ నుంచి వైద్యులు వెళ్లి రావడం ఈ ఆందోళనకు ఊతమిచ్చినట్టయింది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు జైలుకు వెళ్లి 33 రోజులు దాటిపోయింది.. నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి.. ఇలా బంధీగా ఉండడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడూ దిశా నిర్దేశం చేసే తమ నాయకుడిని వెంటనే విడుదల చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు..
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
చంద్రబాబు ఆరోగ్యంపై హైటెన్షన్ నెలకొంది. జనా ల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆయన బాగానే ఉన్నారని అధికారులు వల్లెవేస్తున్నా.. పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా కనిపిస్తోంది. చంద్రబాబుకు 73 ఏళ్ల వయసు కావడంతో ఆరోగ్యంపై ముందు నుంచీ భ యాందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. చంద్రబా బును గత నెల 10వ తేదీన అర్ధరాత్రి సమయంలో జ్యుడిషియల్ రిమాండు నిమిత్తం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు చంద్రబాబు ముఖంలో బడలిక సైతం కనిపిం చలేదు.కానీ గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఆరో గ్యంపై ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు రేకెత్తుతు న్నాయి.ఇదిలా ఉండగా ఆయన డీహైడ్రేషన్‌కి గురికావ డం ఉత్కంఠకు తెర తీసింది.తర్వాత చంద్రబాబు చర్మ సంబ ంధిత సమస్యతో బాధపడుతు న్నారని విషయం బయటకు వచ్చింది.ఇది కూడా జైలు అధికా రులు ముందుగా బయటకు చెప్పలేదు. స్పెషలిస్టు వైద్యులను పంపించాలంటూ జీజీహెచ్ సూపరింటెండెంట్‌కి జైలు అధికా రులు లేఖ రాశారని తెలియ డంతో కలకలం తీవ్రమైంది. ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు 12న వెళ్లి వైద్య పరీక్షలు చేశారు. ఆయన చేతులు, ముఖం, ఛాతీ తదితర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ ఎలర్జీ,ఫంగల్ ఇన్‌ఫెక్షన్లతో బాధ పడుతున్నారని నిర్ధారించారు. చర్మం రంగుమారినట్లు నివేదించారు.అధిక ఉష్ణోగ్ర తలకు తోడు జైలులో చల్లటి వాతా వరణం లేక సమ స్య వస్తోందని తేల్చారు.కొన్ని మందులనూ రాసిచ్చారు. ఇదిలా ఉండగా 14వ తేదీన విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబు ఆరోగ్య రిత్యా ఏసీ సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికా రులు చర్యలు చేపడతామని తెలిపారు.
ఎందుకింత తాత్సారం
చంద్రబాబు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటారు.ఆహారం కారణంగా సమస్య వచ్చే అవకాశం లేదు. జైలులోని వాతావరణమే అనుకూలించ లేదు. ఇప్పటికే ఉన్న చర్మ సంబంధిత వ్యాధి మరింత ఉధృతమవడానికి కారణమవుతోందని వైద్యులు వెల్లడిం చారు. చల్లటి వాతావరణం కల్పించాలని అధి కారికంగా సూచించారు కూడా.ఏసీబీ కోర్టు ఆదేశిం చేవరకూ జైలు అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టక పోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.డీఐజీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చం ద్రబాబు ఆరోగ్యం గురించి మాట్లాడు తున్నారు. 12న మొదటి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.అదీ సమ గ్రంగా లేదు.దీంతో ఆందోళన ఎక్కు వైంది.ఈ పరిస్థి తులన్నీ గమనిస్తున్న ప్రజలు చంద్ర బాబుపై ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మత్తు డాక్టరెందుకో!
చర్మ సంబంధిత వ్యాధుల స్పెషలిస్టును డెర్మటాల జిస్టు అంటారు. జైలులోని ఆస్ప త్రిలో ఉన్న డాక్టర్లలో ఒకరు ఎండీ డెర్మటాలజీ స్పెషలిస్టు అని చెప్పారు. అయితే.. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల బృందం వెళ్లి వైద్య పరీక్షలు ఎందుకు చేయా ల్సి వచ్చిందో అనే దానిపై స్పష్టత లేదు. జైలు అధికారులు మాత్రం సెకండ్ ఒపీ నియన్ అంటు న్నారు.తర్వాత ఏకంగా ఐదుగురితో కూ డిన వైద్యుల బృందం 14న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరిశీలించింది.ఈ వైద్యుల బృందంలో ఎనస్తీషి యా (మత్తు మందు) డాక్టరు కూడా ఉండడం గమనార్హం. చంద్రబాబును పరీక్షించిన ఈ వైద్యుల బృం దం దద్దుర్లు మినహా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉం దని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యం అంత ఆందోళనగా లేనప్పుడు ఇంతమంది స్పెషలిస్టుల అవసరం ఏముం దనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్ర బాబు ఆరోగ్యంపై పూర్తి భరోసా కనిపించడం లేదు. దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి.
చలించిన రక్తబంధం
చంద్రబాబు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నప్పుడు కూడా జైలు అధికా రులు బయటకు విషయం పొక్క నీయలేదు. ములాఖత్‌కి వెళ్లినపుడు కుటుంబ సభ్యులకు తెలిసింది. అలా డీహైడ్రేషన్ విషయం బయటకు వచ్చింది. తర్వాత చర్మ సంబంధిత వ్యాధి ముదిరే వరకూ పరిస్థితి వచ్చింది. శనివారం భువనేశ్వరి, లోకేశ్ చంద్రబాబును చూడడానికి ములాఖత్ అనుమతి తీసుకొని వెళ్లారు.అయితే చంద్రబాబు బాగా నీరసంగా ఉండడం, చర్మ సంబంధిత వ్యాధితో బాధ పడుతుండడం..అయినా బయట మంచి ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించకపోవడంతో భువనేశ్వరి, లోకేశ్ చలిం చిపోయినట్టు సమాచారం. ఓ సందర్భంలో డీఐజీపై అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ములాఖత్ ముగిసిన తర్వాత జైలు బయట లోకేశ్ మీడియాతో మాట్లాడతారు. అయితే.. ఈసారి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. లోకేశ్, భువనేశ్వరి ముఖాల్లో ఆవేదన స్పష్టంగా కనిపించించడం గమనార్హం..
జీజీహెచ్ వైద్యుల అత్యవసర భేటీ
ఆ తర్వాత ఎస్పీ కార్యాలయానికి పరుగు
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 14 : రాజమహేంద్రవరం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ శనివారం అన్ని డిపార్టుమెంట్ల హెచ్‌వోడీలతోనూ జీజీహెచ్‌లో అత్యున్నతస్థాయి వైద్య బృందంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో అత్యవసర భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుకు చర్మసంబంధిత సమస్యలపై జీజీహెచ్ డెర్మటాలజిస్టులు గురువారం జైలు కు వెళ్లి వైద్య పరీక్షలు చేశారు. మందులు రాశారు. నివేదికను జైలు ఉన్నతాధికారులకు అందజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జీజీహెచ్‌లోని హెచ్‌వోడీలుఅందరూ అత్యవసర సమావేశానికి హాజరుకావాల్సిందిగా సూపరింటెండెంట్ ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని సూపరింటెండెంట్ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సమావేశం ముగిసింది. తర్వాత సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ ఆసుపత్రి హెచ్‌వోడీలతో సహా జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. అక్కడ ప్రధానంగా చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిపైనే చర్చకు వచ్చినట్టు తెలిసింది.