Harsh Kumar: ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్‌తో జగన్ పనైపోయింది
ABN, First Publish Date - 2023-03-25T13:25:06+05:30
వైసీపీ ఎమ్మెల్యేలంతా జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేల కోటాలో అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ చేసినా గెలిచేది
రాజమండ్రి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ ఎంపీ హర్షకుమార్ (Former MP Harsh Kumar) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న వారిపై ప్రభుత్వమే కేసులు పెడుతోంది. బీజేపీ ప్రభుత్వం న్యాయ స్థానాన్నే చేతుల్లోకి తీసుకుంది. మోదీ (MODI) దత్తపుత్రుడుగా ఉన్న జగన్ (JAGAN) ప్రతీ శుక్రవారం కోర్టుకి వెళ్లకుండా చేశారు. బ్యాంకు డబ్బులు ఎగ్గొట్టిన వారినందరినీ మోదీ విదేశాలకు పంపేశారు. అదానీ (Adani), అంబానీ (Ambani)లకు దేశ సంపద దోచిపెట్టినా ఎవరూ మాట్లాడకూడదనే సందేశం మోదీ ఇచ్చారు. రాహుల్ (Rahul Gandhi) ను లోక్‌సభ నుంచి సస్పెన్షన్ చేయటం దుర్మార్గం. జగన్ పొగరు నాశనానికి నడిపిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌కు తగిన గుణపాఠం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలంతా జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేల కోటాలో అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ చేసినా గెలిచేది. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం జగన్. దళితులను హత్య చేసిన నిందితులను ఎక్కడా అరెస్ట్ చేయడం లేదు. మద్యం తాగిన వాళ్లంతా జగన్‌ను తిట్టుకుంటున్నారు.’’ అని హర్షకుమార్ చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-03-25T13:26:38+05:30 IST