పోలవరంపై చర్చకు సిద్ధమా?
ABN , First Publish Date - 2023-06-08T00:57:18+05:30 IST
ఇరిగిషన్‌పై అవగాహన లేని సీఎం జగన్ వల్ల ఎంతో ప్రాధాన్యత కలిగిన పోలవరం ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ,రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు.

రాజమహేంద్రవరం సిటీ, జూన్ 7 : ఇరిగిషన్‌పై అవగాహన లేని సీఎం జగన్ వల్ల ఎంతో ప్రాధాన్యత కలిగిన పోలవరం ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ,రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వేల కోట్ల రూపాయల ఖర్చును ప్రభుత్వం చూపిస్తుందని విమర్శించారు. దమ్ముంటే పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ కానీ.. ఇరిగేషన్ మంత్రి కానీ డిబేటుకు రావాలని సవాల్ చేశారు. గత టీడీపీ హయా ంలో రూ.65 వేల కోట్లు ఇరిగేషన్‌కు ఖర్చు చేశామని ఈ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. ఖర్చులు తప్ప పనులు కనిపించడంలేదన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పఽథకం ఆపేశారని ధ్వజమెత్తారు. ఇసుక దోపిడీ, మైనింగ్ దోపిడీ, లిక్కర్ దోపిడీ చేసి ప్రజలను ముంచేసిన ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. కరెంట్ బిల్లులను నాలుగు రెట్లు పెంచారని బిల్లులు చూస్తేనే షాక్ తగులుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరమే పూర్తి చేయలేని జగన్ అక్కడ 5 స్టార్ హోటల్ కడతానని చెప్ప డం చాలా హస్యస్పదంగా ఉందన్నారు. ఆంధ్ర ప్రజలకు దగా చేసి జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, ఎం శివసత్యప్రసాద్ పాల్గొన్నారు.