Mahanadu Dwakra womens: డ్వాక్రా మహిళలు మహానాడుకు వెళ్లకుండా ప్రభుత్వం ఏం చేసిందంటే..!
ABN , First Publish Date - 2023-05-27T11:44:20+05:30 IST
అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లలో డ్వాక్రా మహిళలకు వైద్య పరీక్షలు.. వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఏలూరు: రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడు (Mahanadu)కు డ్వాక్రా మహిళలు (Dwakra womens) వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర పన్నింది. రేపు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లలో డ్వాక్రా మహిళలకు వైద్య పరీక్షలు.. వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మెప్మా అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఈ కార్యక్రమాలు నిర్వహించాలని.. అలాగే భోజన సదుపాయం కల్పించాలని ఆదేశించారు. భోజన సదుపాయం నిమిత్తం నిధులు కూడా అధికారులు మంజూరు చేశారు.
ఇదిలా ఉంటే రాజమండ్రిలో ఘనంగా టీడీపీ మహానాడు ప్రారంభమైంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకులు తరలివచ్చారు. పరిసరాలన్నీ పసుపు జెండాలతో పసుపుమయంగా మారిపోయింది.